Supreme Court: భార్యకు విడాకులు ఇవ్వొచ్చు.. పిల్లలకు కాదు: సుప్రీంకోర్టు

ఒక వ్యక్తి తన భార్యకు విడాకులు ఇవ్వవచ్చు గానీ పిల్లలకు కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వారి సంరక్షణ నిమిత్తం రూ.4 కోట్లు పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది...

Updated : 18 Aug 2021 14:25 IST

వారికి పరిహారంగా రూ.4 కోట్లు ఇవ్వండి
ఆభరణాల వ్యాపారి కేసులో సుప్రీంకోర్టు ఆదేశం

దిల్లీ: ఒక వ్యక్తి తన భార్యకు విడాకులు ఇవ్వవచ్చు గానీ పిల్లలకు కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వారి సంరక్షణ నిమిత్తం రూ.4 కోట్లు పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. 2019 నుంచి విడివడి ఉంటున్న భార్యాభర్తల పరస్పర అంగీకారం మేరకు విడాకులు మంజూరు చేసింది. ముంబయికి చెందిన ఆభరణాల వ్యాపారి దాఖలు చేసిన విడాకుల కేసుపై జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్, జస్టిస్‌ ఎం.ఆర్‌.షాల ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. పరస్పర ఒప్పందంలోని షరతులకు ఉభయులు కట్టుబడి ఉండాలని ఆదేశించింది. కరోనా వల్ల మారిపోయిన పరిస్థితుల్లో తన క్లయింట్‌ రూ.4 కోట్ల పరిహారం చెల్లించడానికి మరికొంత సమయం కావాలని భర్త తరఫు న్యాయవాది కోరారు. దానికి ధర్మాసనం అంగీకరించలేదు. కడుపున పుట్టిన పిల్లల సంరక్షణను చూసుకోవాల్సిందేనని, మైనర్‌ పిల్లల పోషణ నిమిత్తం తాము చెప్పిన మొత్తాన్ని చెల్లించాలని తేల్చిచెప్పింది. వచ్చే నెల ఒకటో తేదీన రూ.కోటి, ఆ నెల 30న మిగిలిన రూ.3 కోట్లు ఇవ్వాలని ఆదేశించింది. కక్షిదారులు పరస్పరం దాఖలు చేసుకున్న కేసుల్ని కొట్టివేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని