త్వరలోనే తెలుగులో మాట్లాడతా: తమిళిసై

ప్రభుత్వానికి, ప్రజలకు సంధానకర్తగా ఉంటానని.. ప్రజా సమస్యల పరిష్కారానికి రాజ్‌భవన్‌ వంతెనగా వ్యవహరించేలా

Published : 03 Oct 2020 01:17 IST

రాజ్‌భవన్‌లో ఈ-ఆఫీస్‌ను ప్రారంభించిన గవర్నర్‌

హైదరాబాద్‌: ప్రభుత్వానికి, ప్రజలకు సంధానకర్తగా ఉంటానని.. ప్రజా సమస్యల పరిష్కారానికి రాజ్‌భవన్‌ వంతెనగా వ్యవహరించేలా చూస్తానని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని రాజ్‌భవన్‌లో ఈ-ఆఫీస్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మీడియాతో మాట్లాడారు. డిజిటలైజేషన్‌లో భాగంగా ప్రారంభించిన ఈ-ఆఫీస్‌.. కాగిత రహిత, పర్యావరణహితంగా ఉంటుందని చెప్పారు. తద్వారా రాజ్‌భవన్‌ కార్యక్రమాలు సురక్షితంగా, వేగంగా జరిగేందుకు దోహదపడుతుందని ఆమె తెలిపారు. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాన్ని తాను స్వాగతిస్తున్నానని.. ఇది రైతులకు లాభం చేకూర్చేలా ఉందని అభిప్రాయపడ్డారు. త్వరలోనే తాను పూర్తిస్థాయిలో తెలుగులో మాట్లాడతానని.. అందుకు తగ్గ కసరత్తు చేస్తున్నట్లు తమిళిసై చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు