ఆన్‌లైన్‌లో శ్రీవారి సర్వదర్శనం టికెట్లు?

తిరుమల శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల కోసం శనివారం భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు.

Published : 31 Oct 2020 16:21 IST

పరిశీలిస్తామన్న తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి

తిరుమల: తిరుమల శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల కోసం శనివారం భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. స్వామి వారి దర్శనానికి తితిదే శుక్రవారం రాత్రే టికెట్లు జారీ చేసింది. ఫలితంగా ఈరోజు టికెట్లు లేకపోవడంతో భక్తులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న అదనపు ఈవో ధర్మారెడ్డి అక్కడికి చేరుకుని భక్తులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. తిరుమల శ్రీవారి సర్వదర్శనం టికెట్లను ఆన్‌లైన్‌లో కేటాయించేలా తితిదే ఈవోతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆదివారం దర్శనం కోసం టికెట్లను శుక్రవారమే ఇచ్చేయటంపై కొందరు భక్తులు అదనపు ఈవో ఎదుట ఆగ్రహం వ్యక్తం చేశారు. 

టికెట్లను ఆన్‌లైన్‌లో పెడితే వాటిని కొందరు పక్కదారి పట్టించే అవకాశం ఉందన్నారు. కంప్యూటర్‌ పరిజ్ఞానం లేనివారు, నిరక్షరాస్యుల కోసమే అలిపిర వద్ద టికెట్లు ఇస్తున్నట్టు చెప్పారు. భక్తుల డిమాండ్‌ మేరకు సోమవారం వరకూ టికెట్లను ఇస్తున్నామని ధర్మారెడ్డి వివరించారు. అయితే, మంగళవారం టికెట్లు ఇచ్చే అంశంపై ఈవోతో చర్చించి నిర్ణయం చెబుతామని పేర్కొన్నారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తర్వాత సర్వదర్శనం టికెట్లను సైతం ఆన్‌లైన్‌ చేసే అంశంతోపాటు రోజుకు ఐదు వేల టికెట్లను ఇచ్చే ప్రతిపాదనలను పరిశీలిస్తామని అదనపు ఈవో ధర్మారెడ్డి వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని