IN PICS: తెలుగు రాష్ట్రాల్లో నేటి విశేషాలు

 ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్పయాత్ర ప్రారంభించి మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారె

Published : 06 Nov 2020 22:54 IST

వరద బాధితులందరికీ తక్షణమే ప్రభుత్వం ప్రకటించిన సాయం అందేలా చూడాలని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. సికింద్రాబాద్‌ జోనల్‌ కమిషనర్‌ శ్రీనివాసరెడ్డికి బాధితుల తరపున దరఖాస్తులను అందించిన ఆయన అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

విశాఖ అరిలోవాలోని సెయింట్ ఆన్స్‌ హైస్కూలులో విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా పలు పాఠశాలల్లో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు పాజిటివ్‌ వచ్చిన నేపథ్యంలో ఈ పరీక్షలు చేపట్టారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్పయాత్ర ప్రారంభించి మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాదయాత్ర చేశారు.

అబిడ్స్‌లోని జీహెచ్‌ఎంసీ కార్యాలయం వద్ద ఆర్థికసహాయం అందించి ఆదుకోవాలని కోరుతూ ధర్నా చేస్తున్న అంబర్‌పేట వరద బాధితులు

హన్మకొండలోని హరిత హోటల్‌లో దేవాదుల ప్రాజెక్టుపై మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్‌, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్‌, జిల్లా ప్రజాప్రతినిధులు పాల్గొని ప్రాజెక్టు పురోగతిపై చర్చించారు.

నాంపల్లి భాజపా కార్యాలయం ఎదుట ఆత్మహత్యకు పాల్పడి చికిత్స పొందుతూ మృతిచెందిన కార్యకర్త శ్రీనివాస్‌ అంత్యక్రియల్లో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని