ఏపీలో మరో 3 రోజులు వర్షాలు

పశ్చిమ బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం వచ్చే 24 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

Updated : 18 Oct 2020 20:17 IST

అమరావతి వాతావరణ శాఖ

అమరావతి: పశ్చిమ బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం వచ్చే 24 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉన్నందున వచ్చే మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో తేలిక నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ క్రమంలో ఇవాళ, రేపు ఉత్తరకోస్తా, గోదావరి జిల్లాల్లో తేలిక నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇవాళ ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడే సూచనలున్నాయని పేర్కొంది. రానున్న మూడు రోజులు రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర, దక్షిణకోస్తాలో తేలిక నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని