Ganesh Chaturti: వినాయకుడికి కానుకగా వజ్రాల కిరీటం.. ధర తెలిస్తే షాక్‌ అవుతారు!

మహారాష్ట్రలోని పుణెలో ప్రసిద్ధ దగ్దుషేత్‌ హల్వాయ్‌ గణపతి ఆలయానికి ఓ భక్తుడు భారీ కానుకను సమర్పించాడు. వజ్రాలతో ......

Updated : 13 Sep 2021 22:14 IST

పుణె: మహారాష్ట్రలోని పుణెలో ప్రసిద్ధ దగ్దుషేత్‌ హల్వాయ్‌ గణపతి ఆలయానికి ఓ భక్తుడు భారీ కానుకను సమర్పించాడు. వజ్రాలతో పొదిగిన 10కిలోల బంగారం కిరీటాన్ని వినాయకుడికి బహూకరించాడు. ఈ కిరీటం విలువ  సుమారు ₹6కోట్లు ఉంటుందని ఆలయ అధికారులు పేర్కొన్నారు. వినాయక చవితి రోజున భక్తుడు సమర్పించిన ఈ స్వర్ణ కిరీటాన్ని స్వామివారికి అలంకరించినట్టు తెలిపారు. అయితే, ఈ భూరి కానుకను సమర్పించిన భక్తుడు తన వివరాలను గోప్యంగా ఉంచాలని కోరారని ఆలయ ట్రస్టు అధికారులు అన్నారు. ఈ కానుకను వినాయక చవితి రోజు సమర్పించారని, ప్రత్యేక డిజైన్‌లో తీర్చిదిద్దిన ఈ స్వర్ణ కిరీటం దగ్దుషేత్‌ హల్వాయి గణపతి ఆలయంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచినట్టు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని