Viral Video: మూడేళ్ల బిడ్డను ఎలుగుబంటి ముందుకు విసిరిన తల్లి..!

మూడేళ్ల కన్నబిడ్డను ఓ తల్లి ఎత్తైన ప్రదేశం నుంచి ఎలుగుబంటి ముందుకు విసిరేసింది. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన ఉజ్బెకిస్థాన్‌లోని తాష్కెంట్‌ జూలో చోటుచేసుకుంది. ఇప్పుడు ఆ దృశ్యాలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

Published : 04 Feb 2022 01:57 IST

ఇంటర్నెట్ డెస్క్: మూడేళ్ల కన్నబిడ్డను ఓ తల్లి ఎత్తైన ప్రదేశం నుంచి ఎలుగుబంటి ముందుకు విసిరేసింది. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన ఉజ్బెకిస్థాన్‌లోని తాష్కెంట్‌ జూలో చోటుచేసుకుంది. ఇప్పుడు ఆ దృశ్యాలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

తాష్కెంట్‌ జూలో ఓ ఎలుగుబంటి దానిని ఉంచిన ఆవరణలో అటూఇటూ తిరుగుతూ ఉంది. జూకు వచ్చిన ఓ మహిళ అక్కడ కొద్దిసేపు నిలబడి.. తన చేతిలో ఉన్న మూడేళ్ల బిడ్డను అమాంతం ఎలుగుబంటి ముందుకు పడేసింది. పక్కన ఉన్నవారు ఆపేందుకు ప్రయత్నించినా, కుదరలేదు. ఆ ఆకస్మిక ఘటనకు ఎలుగు తత్తరపాటుకు గురైంది. మొదట ఆ జంతువు చిన్నారి దగ్గరకు వెళ్లినా.. ఏమీ చేయకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది.  ఆ వెంటనే జూ అధికారులు స్పందించి  ఆ పాపను బయటకు తీసుకువచ్చారు. అదృష్టవశాత్తూ పాప గాయాలతో బయటపడింది. 

వెంటనే జూ సిబ్బంది పాప తల్లిని పోలీసులకు అప్పగించారు. ఆమెపై హత్యాయత్నం కింద కేసు నమోదైంది. ఒకవేళ నేరం నిరూపితమైతే.. 15 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆమె చిన్నారికి ప్రమాదం తలపెట్టడానికి గల కారణం మాత్రం తెలియరాలేదు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని