Anand Mahindra: అమ్మా.. నాకు శిక్షణ ఇచ్చినందుకు ధన్యవాదాలు: ఆనంద్‌ మహీంద్రా

పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra) మాతృదినోవత్సవాన్ని (Mother's Day) పురస్కరించుకుని తన తల్లి ఇందిరా మహీంద్రాతో కలిసి ఉన్న చిన్ననాటి ఫొటోను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశారు.

Published : 14 May 2023 18:40 IST

ముంబయి: మాతృదినోత్సవం (Mother's Day) సందర్భంగా సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరు తమ మాతృమూర్తులను గుర్తుచేసుకుంటూ.. సామాజిక మాధ్యమాల వేదికగా శుభాకాంక్షలు చెబుతూ.. వారితో కలిసివున్న ఫొటోలను షేర్‌ చేస్తున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) మాతృదినోత్సవం సందర్భంగా తన తల్లితో కలిసి ఉన్న ఫొటోను ట్విటర్‌లో షేర్‌ చేశారు. తాను ఈ స్థాయికి రావడానికి తన తల్లి ఇచ్చిన శిక్షణ కారణమని, అందుకు ధన్యవాదాలు చెబుతూ ట్వీట్ చేశారు. 

చిన్నతనంలో తన తల్లి ఇందిరా మహీంద్రాతో కలిసి ఉన్న ఫొటోను పోస్ట్‌ చేస్తూ.. ‘‘ ప్రతి ఏడాది మదర్స్‌డే రోజున మా అమ్మకు సంబంధించిన పాత ఫొటోలను వెతుకుతుంటాను. వాటిలోంచి ఇదొకటి. మా నాన్న అధ్యక్షతన జరిగిన మహీంద్రా యుగైన్‌ స్టీల్‌ వార్షిక వాటాదారుల సమావేశానికి మా అమ్మ నన్ను తీసుకెళ్లినప్పటి ఫొటో. నాకు శిక్షణ ఇచ్చినందుకు ధన్యవాదాలు అమ్మ. నువ్వు ఎక్కడున్నా.. నీకు మాతృదినోత్సవ శుభాకాంక్షలు’’ అని మహీంద్రా ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు ఫొటో ఎంతో బావుందని కామెంట్లు చేస్తున్నారు. ‘‘ ప్రతి ఒక్కరు వాళ్ల అమ్మను గుర్తుచేసుకుంటూ మదర్స్‌డే శుభాకాంక్షలు చెబుతున్నారు. మీ అమ్మ మిమల్ని ఎంతో శక్తివంతంగా తీర్చిదిద్దారు. కష్టపడి పనిచేయడం, ప్రతి పనిని ది బెస్ట్‌గా చేయడంలో మీకు శిక్షణ ఇచ్చారు. మీ అమ్మగారికి హ్యాట్సాఫ్‌’’, ‘‘ పెద్ద విద్యాలయాలు చెప్పలేని ఎన్నో గొప్ప పాఠాలను, ఓ తల్లి తన పిల్లలకు చెబుతుంది’’, ‘‘ మీ అమ్మగారి పక్కన మీరు ఎంతో ఆసక్తిగా ఉన్నట్లు కనిపిస్తున్నారు’’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని