Andhra News: ఏపీ ప్రభుత్వం మరో రూ.వెయ్యి కోట్ల అప్పు

రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) ద్వారా రాష్ట్రప్రభుత్వం మరో రూ.వెయ్యి కోట్ల రుణం తీసుకుంది. సెక్యూరిటీ వేలం ద్వారా రూ.500 కోట్ల చొప్పున రెండు లాట్ల

Published : 18 Aug 2022 16:40 IST

అమరావతి: రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) ద్వారా రాష్ట్రప్రభుత్వం మరో రూ.వెయ్యి కోట్ల రుణం తీసుకుంది. సెక్యూరిటీ వేలం ద్వారా రూ.500 కోట్ల చొప్పున రెండు లాట్ల సెక్యూరిటీలను వేలం వేశారు. 13 ఏళ్ల కాలపరిమితితో 7.72శాతం వడ్డీకి ఈ సెక్యూరిటీల వేలం నిర్వహించారు. దీని ద్వారా ఏపీ ప్రభుత్వం రూ.1000కోట్లు రుణం పొందినట్టు  ఆర్‌బీఐ వెల్లడించింది. సెక్యూరిటీల వేలం ద్వారా జులై 21వరకు రూ.21,500 కోట్ల రుణాన్ని ఏపీ ప్రభుత్వం పొందింది. ఇప్పటికే ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం కొద్దిపాటి వెసులుబాటు మాత్రమే మిగిలి ఉంది. ఆరు నెలలు గడవక ముందే రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ద్వారా కేంద్రం అనుమతించిన మొత్తంలో భారీగా రుణం తీసుకుంది. రిజర్వు బ్యాంకు ప్రతి మంగళవారం నిర్వహించే సెక్యూరిటీల వేలంలో పాల్గొని ఈ మొత్తం రుణం తీసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని