నిబంధనలను సడలించిన ఏపీ ఆర్టీసీ

బస్సుల్లో ప్రయాణికుల అనుమతి విషయమై ఏపీ ఆర్టీసీ నిబంధనలను సడలించింది. బస్సుల్లో 50 శాతం సీట్లలోనే ప్రయాణిలను అనుమతించాలనే నిబంధనను ఎత్తివేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏపీ ఆర్టీసీ నిబంధనలను సడలించింది. ఇకపై పూర్తిస్థాయి సీటింగ్‌ సామర్థ్యంతో బస్సులు నడపాలని ఆర్టీసీ సూచించింది. దూరప్రాంత రిజర్వేషన్‌ సర్వీసుల్లో పూర్తిస్థాయిలో సీట్లలో ప్రయాణికులకు అనుమతి ఇచ్చారు. పల్లెవెలుగు, సీటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌లో దశలవారీగా పునరుద్ధరించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు

Updated : 23 Sep 2020 04:11 IST

అమరావతి: బస్సుల్లో ప్రయాణికుల అనుమతి విషయమై ఏపీ ఆర్టీసీ నిబంధనలను సడలించింది. బస్సుల్లో 50 శాతం సీట్లలోనే ప్రయాణిలను అనుమతించాలనే నిబంధనను ఎత్తివేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏపీ ఆర్టీసీ నిబంధనలను సడలించింది. ఇకపై పూర్తిస్థాయి సీటింగ్‌ సామర్థ్యంతో బస్సులు నడపాలని ఆర్టీసీ సూచించింది. దూరప్రాంత రిజర్వేషన్‌ సర్వీసుల్లో పూర్తిస్థాయిలో సీట్లలో ప్రయాణికులకు అనుమతి ఇచ్చారు. పల్లెవెలుగు, సీటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌లో దశలవారీగా పునరుద్ధరించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు ఓపీఆర్‌ఎస్‌లో మార్పులు చేయాలని జిల్లాల ఆర్‌ఎంలకు ఆర్టీసీ ఎండీ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ అధికారులకు మార్గదర్శకాలు పంపారు. ప్రయాణికుల కోసం గ్రౌండ్‌ బుకింగ్‌ పాయింట్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అంతేకాకుండా బస్సులో ప్రయాణికులు శానిటైజర్‌ తప్పక వాడాలని సూచించారు. ప్రయాణికులు, డ్రైవర్‌, కండక్టర్లు తప్పక మాస్కులు ధరించాలని ఆర్టీసీ సూచించింది.  
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని