AP ICET: ఏపీ ఐసెట్‌ దరఖాస్తులు ప్రారంభం.. రెండు షిఫ్టుల్లో పరీక్ష!

ఏపీ ఐసెట్‌(AP ICET 2023) దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకొనే విద్యార్థులు మార్చి 20 నుంచి దరఖాస్తులు చేసుకోండి.

Published : 21 Mar 2023 01:38 IST

అనంతపురం: ఏపీలోని విశ్వవిద్యాలయాలు, అనుబంధ కాలేజీల్లో ఎంబీఏ(MBA), ఎంసీఏ(MCA) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2023 (AP ICET)కు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం(SKU) నిర్వహించే ఈ పరీక్షకు సోమవారం (మార్చి 20) నుంచి ఏప్రిల్‌ 19 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని  రాష్ట్ర ఉన్నత విద్యామండలి (APSCHE) తెలిపింది.  దరఖాస్తు రుసుం రూ.650లుగా చెల్లించాల్సి ఉంటుంది. అదే, బీసీ విద్యార్థులైతే రూ.600, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే రూ.550లు చొప్పున చెల్లించాలి. మే 24, 25 తేదీల్లో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష కోసం అడ్మిట్‌ కార్డులను మే 20 నుంచి అందుబాటులో ఉంచనున్నారు. ఈ పరీక్షను ఉదయం 9గంటల నుంచి 11.30గంటల వరకు; అలాగే, మధ్యాహ్నం 3గంల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు రెండు షిఫ్టులలో నిర్వహించనున్నట్టు ఐసెట్‌ కన్వీనర్‌ తెలిపారు.

దరఖాస్తుల కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని