AP Sarpanches: సర్పంచుల ‘చలో తాడేపల్లి’లో ఉద్రిక్తత.. పలువురి అరెస్టు

సర్పంచులు తలపెట్టిన పంచాయతీ రాజ్‌ కమిషనర్‌ కార్యాలయం ముట్టడి ఉద్రిక్తతలకు దారి తీసింది.

Updated : 03 Jul 2023 12:19 IST

విజయవాడ: ఏపీలో సర్పంచులు తలపెట్టిన పంచాయతీ రాజ్‌ కమిషనర్‌ కార్యాలయం ముట్టడి ఉద్రిక్తతలకు దారి తీసింది. ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ.. తాడేపల్లిలోని పంచాయతీరాజ్ , గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ కార్యాలయం ముట్టడికి రాష్ట్ర సర్పంచుల సంక్షేమ సంఘం పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో కార్యాలయం వద్ద రోడ్డుపై బైఠాయించి సర్పంచుల ఆందోళనకు దిగారు. దీంతో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొంతమంది సర్పంచులను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. 

పోలీసుల వైఖరిపై సర్పంచులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘హక్కుల కోసం పోరాడుతుంటే అరెస్టు చేస్తారా? రావాల్సిన బకాయిలు, నిధులు వెంటనే విడుదల చేయాలి.  20 మంది సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నా ప్రభుత్వం స్పందించట్లేదు. నిధులు లేక గ్రామాల్లో రోడ్లు కూడా వేయలేని దుస్థితి ఏర్పడింది. గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వాడుకున్న నిధులు పంచాయతీ ఖాతాల్లో వేయాలి’’ అని సర్పంచులు డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని