TS High Court: బుద్వేల్‌ భూముల వేలం.. అత్యవసర విచారణకు బార్‌ అసోసియేషన్‌ అభ్యర్థన

నగరంలోని రాజేంద్రనగర్‌ మండలం బుద్వేల్‌ భూముల ఈ-వేలం నిలిపివేయాలంటూ దాఖలు చేసిన పిల్‌పై అత్యవసర విచారణ చేపట్టాలని తెలంగాణ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ కోరింది.

Updated : 10 Aug 2023 12:07 IST

హైదరాబాద్‌: నగరంలోని రాజేంద్రనగర్‌ మండలం బుద్వేల్‌ భూముల ఈ-వేలం నిలిపివేయాలంటూ దాఖలు చేసిన పిల్‌పై అత్యవసర విచారణ చేపట్టాలని తెలంగాణ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ కోరింది. ఈ మేరకు హైకోర్టును అభ్యర్థించింది. బుద్వేల్ భూములు హైకోర్టు నిర్మాణానికి కేటాయించాలంటూ ఇటీవల బార్‌ అసోసియేషన్‌ పిల్‌ దాఖలు చేసింది. అసోసియేషన్‌ తరఫున కార్యదర్శి కట్టా ప్రదీప్‌రెడ్డి ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. నేడే బుద్వేల్‌ భూముల వేలం ఉన్నందున లంచ్‌ మోషన్‌ విచారణ చేపట్టాలని పిటిషనర్‌ హైకోర్టును కోరారు.  

బుద్వేల్‌లో హైకోర్టు భవనం నిర్మాణానికి 100 ఎకరాలు కేటాయించాలని అసోసియేషన్‌, రిజిస్ట్రార్‌ జనరల్‌ పంపిన ప్రతిపాదనలను ప్రభుత్వం పట్టించుకోకుండా వేలం నిర్వహణకు నోటిఫికేషన్‌ జారీ చేయడాన్ని సవాలు చేస్తూ ప్రదీప్‌రెడ్డి ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. హైకోర్టు తరలింపుపై భిన్నాభిప్రాయాలు ఉన్నందున అధ్యక్షుడు, కార్యవర్గంతో చర్చించాలని పిటిషనర్‌కు ధర్మాసనం సూచించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని