BRAOU: భారీ వర్షాలు.. అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ పరీక్షలు వాయిదా

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ (BRAOU) పరిధిలో నిర్వహించే అన్ని పరీక్షలను వాయిదా వేసినట్లు వర్సిటీ రిజిస్ట్రార్‌ వెల్లడించారు.

Updated : 20 Jul 2023 11:16 IST

హైదరాబాద్‌: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ (BRAOU) పరిధిలో నిర్వహించే అన్ని పరీక్షలను వాయిదా వేసినట్లు వర్సిటీ రిజిస్ట్రార్‌ వెల్లడించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తెలుగు రాష్ట్రాల పరిధిలో పరీక్షలను వాయిదా వేసినట్లు తెలిపారు. పరీక్షల రీషెడ్యూల్ తేదీలను త్వరలో ప్రకటిస్తామని రిజిస్ట్రార్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని