Viveka Murder Case: రహస్య సాక్షి వాంగ్మూలం నమోదు.. ఆయన ఎవరంటే?

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో రహస్య సాక్షి వైకాపా నేత శివచంద్రారెడ్డి వాంగ్మూలాన్ని సీబీఐ నమోదు చేసింది. 

Updated : 24 Jul 2023 14:55 IST

హైదరాబాద్‌: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు(Viveka Murder Case)లో రహస్య సాక్షికి సంబంధించి గతంలో ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ సందర్భంగా సీబీఐ (CBI) ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఆ రహస్య సాక్షిగా పులివెందుల వైకాపా నేత కొమ్మా శివచంద్రారెడ్డి వాంగ్మూలాన్ని కోర్టుకు సీబీఐ సమర్పించింది. ఏప్రిల్‌ 26న హైదరాబాద్‌లో శివచంద్రారెడ్డి వాంగ్మూలాన్ని సీబీఐ నమోదు చేసింది. దీనికి సంబంధించిన వివరాలను సీబీఐ జూన్‌ 30న కోర్టుకు సమర్పించింది. 

Suneetha Narreddy: సజ్జల చెప్పినట్టు చెయ్యమన్నారు

శివచంద్రారెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం.. ‘‘2018 అక్టోబరు 1న వివేకానందరెడ్డి మా ఇంటికొచ్చారు. కడప ఎంపీగా అవినాష్‌రెడ్డి పోటీ చేయరని ఆయన నాతో చెప్పారు. వైకాపాను వీడొద్దని నన్ను కోరారు. అవినాష్‌, శివశంకర్‌రెడ్డిలతో పనిచేయలేనని చెప్పాను. అవినాష్‌కు జమ్మలమడుగు ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వనున్నట్లు వివేకా చెప్పారు. కడప ఎంపీగా విజయమ్మ లేదా షర్మిల పోటీ చేస్తారని తెలిపారు. 2018 అక్టోబర్‌ 1 వరకు వైకాపా సింహాద్రిపురం మండల కన్వీనర్‌గా ఉన్నాను’’ అని శివచంద్రారెడ్డి పేర్కొన్నారు. 2018 అక్టోబర్‌ 2న తెదేపాలో చేరిన ఆయన.. 2020 జూన్‌లో తిరిగి వైకాపా గూటికి వెళ్లారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని