Railway: కాలం మారింది.. రైలును శుభ్రం చేసే తీరూ మారింది!
పదుల సంఖ్యలో బోగీలు ఉండే రైలును శుభ్రం చేయడం అంతా సులువేం కాదు. నీళ్లతో బోగీలను కడిగి.. వాటిని వస్త్రంతో శుభ్రం చేస్తుంటారు. అది ఒకప్పుడు.. ఇప్పుడు ఒక్క స్విచ్ వేయగానే.. యంత్రాలు రైలును చకచకా శుభ్రం చేస్తున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఏదైనా వస్తువుపై దుమ్ము పడితే నీటితో శుభ్రం చేస్తాం. మరి రోజు దుమ్మూధూళిలో ప్రయాణిస్తూ లక్షల మందిని వారి గమ్యస్థానాలకు చేర్చే రైలు (Train)ను ఎలా శుభ్రం చేస్తారో తెలుసా? రైల్వేశాఖ తాజాగా రైలును శుభ్రం చేయడంలో వచ్చిన మార్పును తెలుపుతూ ఓ వీడియోను సోషల్‌మీడియాలో షేర్ చేసింది.
‘చేతితో శుభ్రం చేయడం నుంచి యంత్రం స్విచ్ వేయడం వరకు వచ్చిన మార్పు’ అంటూ రైల్వేశాఖ 17 సెకన్ల నిడివి ఉన్న వీడియోను పంచుకుంది. ఇందులో పైభాగంలో రైల్వే సిబ్బందిలో ఒకరు హ్యాండ్ పంప్ ద్వారా రైలుపై నీరు పోస్తే.. మరొకరు వస్త్రంతో శుభ్రం చేస్తూ కనిపించారు. కిందభాగంలో ఆటోమేటిక్ రైల్వే కోచ్ వాషింగ్ ప్లాంట్‌లో యంత్రాలు కనిపించాయి. రైలు ముందుకు కదులుతుండగా.. ట్రాక్‌కి ఇరువైపుల ఉన్న స్క్రబ్బర్స్ రైలు బయటి భాగాన్ని శుభ్రం చేస్తున్నాయి.
‘ఇది నూతన భారత్.. ఇంకా మరెన్నో విషయాల్లో మార్పులు జరగాలి. అవన్నీ జరుగుతాయని నమ్ముతున్నా’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ‘చాలా బాగుంది.. అలాగే రైలు ప్రయాణిస్తున్నప్పుడే వాష్‌రూమ్స్ శుభ్రం చేయగలిగితే ఇంకా బాగుంటుంది’అని మరో నెటిజన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
America: అమెరికాకు తొలగిన షట్‌డౌన్ ముప్పు
-
Oscar winner Pinky: ‘ఆస్కార్ విజేత’ పింకీ.. ఇపుడు నవ్వటం లేదు!
-
Donald Trump: బైడెన్.. మెట్ల దారిని గుర్తించలేరు.. డొనాల్డ్ ట్రంప్ ఎద్దేవా
-
ఆరోగ్య సురక్ష వైద్య శిబిరం నిర్వహిస్తే బడికి సెలవే..!
-
పాలమూరుకు వరాలిచ్చేనా..!
-
గాంధీ జయంతి నాడు చంద్రబాబు, భువనేశ్వరి నిరసన దీక్ష