Andhra News: విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో సామూహిక అత్యాచార ఘటన.. సీఐ, ఎస్సై సస్పెన్షన్‌

విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో మానసిక వికలాంగురాలిపై సామూహిక అత్యాచార ఘటన నేపథ్యంలో పోలీసులపై రాష్ట్ర ప్రభుత్వం

Updated : 22 Apr 2022 11:52 IST

అమరావతి: విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో మానసిక వికలాంగురాలిపై సామూహిక అత్యాచార ఘటన నేపథ్యంలో పోలీసులపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నున్న సీఐ, సెక్టార్‌ ఎస్సైపై సస్పెన్షన్‌ వేటు వేసింది. తమ కుమార్తె కనిపించట్లేదంటూ బాధితురాలి తల్లిదండ్రులు నున్న పోలీస్‌స్టేషన్‌కు ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్లగా.. స్పందించకుండా సాయంత్రం రావాలంటూ పోలీసులు తిప్పి పంపించేశారు. చివరిసారిగా ఫలానా నంబర్‌ నుంచి ఫోన్‌ వచ్చిందని ఆధారమిచ్చినా సరే వెంటనే చర్యలు చేపట్టలేదు.

పోలీసుల అలసత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. వివిధ పార్టీల నేతలు, ప్రజాసంఘాలు నున్న పోలీస్‌స్టేషన్‌ వద్ద ఆందోళన చేపట్టారు.  ఈ పరిస్థితుల నేపథ్యంలో సీఐ హనీష్‌, ఎస్సై శ్రీనివాసరావును విజయవాడ సీపీ కాంతిరాణా టాటా విధుల నుంచి సస్పెండ్‌ చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని