CM Jagan: ఐఎన్‌ఎస్‌ విశాఖను జాతికి అంకితం చేసిన సీఎం జగన్‌

బహుళ దేశాల నౌకాదళ విన్యాస (మిలాన్‌-22) కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం విశాఖ విచ్చేశారు. ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం విశాఖ చేరుకున్న సీఎం...

Updated : 27 Feb 2022 16:00 IST

విశాఖపట్నం: బహుళ దేశాల నౌకాదళ విన్యాస (మిలాన్‌-22) కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం విశాఖ విచ్చేశారు. ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం విశాఖ చేరుకున్న సీఎం... నేరుగా తూర్పు నౌకాదళ కేంద్రానికి వెళ్లారు. నౌకాదళ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఐఎన్‌ఎస్‌ -విశాఖ నౌకను జాతికి అంకితం చేశారు. ఐఎన్‌ఎస్‌ -విశాఖ నౌక పశ్చిమ నౌకాదళంలో సేవలందించనుంది. ఈ సందర్భంగా జలాంతర్గామి ఐఎన్‌ఎస్‌ వేలను సీఎం సందర్శించారు. సాయంత్రం విశాఖ బీచ్‌లో జరిగే మిలాన్‌కు హాజరై ప్రసంగిస్తారు. కవాతు కార్యక్రమాలు వీక్షిస్తారు. సీఎంతో పాటు సభాపతి తమ్మినేని సీతారాం, మంత్రులు బొత్స సత్యనారాయణ, కన్నబాబు, అవంతి శ్రీనివాస్‌, ఎంపీలు విజయసాయిరెడ్డి, ఎం.వి.వి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని