CM Kcr: అంబేడ్కర్ గొప్పతనాన్ని చాటేలా తెలంగాణ ప్రభుత్వ కార్యాచరణ: సీఎం కేసీఆర్‌

సామాజిక అసమానతల నిర్మూలనకు జీవితాంతం పోరాటం చేసి, అన్ని వర్గాలకూ సమన్యాయం జరగాలన్న దార్శనికతతో రాజ్యాంగాన్ని రూపొందించిన అంబేడ్కర్ జీవితం సదా ఆచరణీయమని సీఎం కేసీఆర్‌ కొనియాడారు. 

Published : 05 Dec 2022 23:32 IST

హైదరాబాద్: సామాజిక అసమానతల నిర్మూలనకు జీవితాంతం పోరాటం చేసి, అన్ని వర్గాలకూ సమన్యాయం జరగాలన్న దార్శనికతతో రాజ్యాంగాన్ని రూపొందించిన అంబేడ్కర్ జీవితం  ఆచరణీయమని సీఎం కేసీఆర్‌ కొనియాడారు. ఆధిపత్య ధోరణులకు, వివక్షకు తావివ్వకుండా.. ప్రజలందరూ స్వేచ్ఛ జీవించాలని ఆయన కోరుకున్నారని సీఎం అన్నారు. అంబేడ్కర్ భారతదేశ అస్తిత్వపు ప్రతీకగా నిలిచారని సీఎం కేసీఆర్ అభివర్ణించారు. రేపు అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన జాతికి చేసిన సేవలను సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు.

‘‘ప్రతిఒక్కరూ ఆత్మగౌరవంతో జీవించాలన్న అంబేడ్కర్ స్ఫూర్తితోనే తెలంగాణ ప్రభుత్వం సకల జనుల సాధికారత దిశగా కృషి చేస్తోంది. తరతరాలుగా సామాజిక, ఆర్థిక వివక్షకు గురవుతున్న ఎస్సీల అభ్యున్నతి కోసం అమలు చేస్తున్న దళితబంధు పథకానికి ప్రేరణ, స్ఫూర్తి అంబేడ్కర్. రాజ్యాంగంలో ఆర్టికల్-3 ద్వారా తెలంగాణ ఏర్పాటుకు కారణమైన అంబేడ్కర్ గొప్పతనాన్ని విశ్వానికి చాటే దిశగా తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. తెలంగాణ నూతన సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టుకున్నాం. దేశంలోనే అతిపెద్దదైన 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నాం. ఆయన ఆశయాలు, విలువలను అనుసరిస్తూ, దళిత బహుజన పేద వర్గాల అభ్యున్నతికి పాటుపడటమే ఆ మహానుభావునికి మనం ఇచ్చే అసలైన నివాళి. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం పాలన సాగిస్తోంది’’ అని కేసీఆర్‌ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని