Mancherial: సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్‌

మంచిర్యాల జిల్లాలో పలు అభివృద్ధి పనులకు సీఎం కేసీఆర్‌ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

Updated : 09 Jun 2023 18:44 IST

మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలో పలు అభివృద్ధి పనులకు సీఎం కేసీఆర్‌ శుక్రవారం శంకుస్థాపన చేశారు. నస్పూర్‌లో 26.24 ఎకరాల విస్తీర్ణంలో రూ.41 కోట్ల వ్యయంతో నిర్మించిన మంచిర్యాల జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయ భవన సముదాయాన్ని, జిల్లా భారాస కార్యాలయాన్ని ప్రారంభించారు. గోదావరి నదిపై రూ. 164 కోట్లతో నిర్మించనున్న మంచిర్యాల అంతర్గాం రహదారి వంతెన, హాజీపూర్ మండలం గుడి పేటలో వైద్య కళాశాల, మందమర్రిలో రూ. 500 కోట్ల వ్యయంతో ఫామ్ ఆయిల్ పరిశ్రమ, కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రూ.1,658 కోట్లతో చెన్నూరు ఎత్తిపోతల పథకం పనులకు సీఎం శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంచిర్యాల నూతన కలెక్టరేట్‌ భవనంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘పరిపాలన సంస్కరణ అంటే పది ఆఫీసులు ఏర్పాటు చేసి.. నలుగురు ఆఫీసర్లను పెంచడం కాదు. సంస్కరణ అనేది ఒకరోజుతో అంతం అయ్యేది కూడా కాదు. ఇది నిరంతరం ప్రక్రియ’’ అన్నారు. కొత్త రాష్ట్రం ఏర్పడేనాటికి ఇతర రాష్ట్రాల నుంచి గొర్రెలను దిగుమతి చేసుకునే పరిస్థితి ఉండేదని, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం గొర్రెల పెంపకంలో దేశంలోనే నెంబర్‌ వన్‌ స్థానంలో ఉందని అన్నారు. త్వరలో దేశవ్యాప్తంగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు రాబోతున్నాయని, పెద్ద సంఖ్యలో వాటిని ఏర్పాటు చేస్తామని అన్నారు. పామాయిల్‌కు దేశంలో గిరాకీ ఏర్పడుతోందన్న కేసీఆర్.. ఆ తోటల పెంపకానికి రైతులు ముందుకు రావాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని