Polavaram project: కొండను తవ్వి పోలవరం జలవిద్యుత్‌ కేంద్రం నిర్మాణం

పోలవరం ప్రాజెక్టు జల విద్యుత్‌ కేంద్రం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. 12 ప్రెజర్‌ టన్నెల్స్‌ పనులు చేపడుతున్నారు. ఇప్పటికే రెండు టన్నెల్స్‌ తవ్వకం పనులు

Published : 07 Oct 2021 01:07 IST

పోలవరం: పోలవరం ప్రాజెక్టు జల విద్యుత్‌ కేంద్రం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. 12 ప్రెజర్‌ టన్నెల్స్‌ పనులు చేపడుతున్నారు. ఇప్పటికే రెండు టన్నెల్స్‌ తవ్వకం పనులు పూర్తి చేశారు. ఒక్కో ప్రెజర్‌ టన్నెల్‌ 9మీటర్ల వెడల్పుతో 150 మీటర్ల పొడవు ఉంటుంది. ప్రతి టన్నెల్‌కు 12 జనరేటర్‌ ట్రాన్స్‌ ఫార్మర్స్‌ అనుసంధానిస్తున్నారు. ఒక్కో ట్రాన్స్‌ ఫార్మర్‌ వంద మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంటాయి.  జలవిద్యుత్‌ కేంద్రం మొత్తం కొండను తవ్వి నిర్మాణం చేపడుతున్నారు. ఇప్పటికే కొండను తవ్వడం పూర్తయింది. 21,39,639 క్యూబిక్ మీటర్ల కొండను తవ్వారు. మిగితా 10 ప్రెజర్ టన్నెల్స్‌ తవ్వకం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని