Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (11-12-2021)

Today Horoscope: 12 రాశులవారి రాశి ఫలం వివరాలు...

Updated : 11 Dec 2021 04:10 IST

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

మీ మీ రంగాల్లో ముందుచూపుతో వ్యవహరించాలి. తోటివారి సూచనలు ఉపకరిస్తాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. ముఖ్య విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం తీసుకోవడం మంచిది. శివారాధన శుభప్రదం.

ఒక సంఘటన మీ మానసికశక్తిని పెంచుతుంది. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. ఆరోగ్యంపై  శ్రద్ధ అవసరం. శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి ఆరాధన మేలైన ఫలితాలను ఇస్తుంది.

సౌభాగ్యసిద్ధి ఉంది. ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారం అవుతుంది. సమయానికి సహాయం చేసేవారు ఉన్నారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. హనుమాన్ చాలీసా చదివితే మంచిది.  

మిశ్రమ కాలం. ముఖ్యమైన పనులను కొన్నాళ్ల పాటు వాయిదా వేసుకోవడమే మంచిది. కొన్ని సంఘటనలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగంలో ఆచితూచి వ్యవహరించాలి. దుర్గాదేవిని, శ్రీవేంకటేశ్వరుడిని పూజిస్తే శుభఫలితాలు కలుగుతాయి.  

అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగండి. సమస్యలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. వేంకటేశ్వరస్వామి ఆలయ సందర్శనం శుభప్రదం.

మంచికాలం. పనితీరుతో మీ పై అధికారుల మనసులను గెలుస్తారు. గౌరవ సన్మానాలు అందుకుంటారు. బంధువులతో విబేధాలు వచ్చే సూచనలు ఉన్నాయి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. విష్ణు నామస్మరణ చేస్తే మంచిది.

ఒక ముఖ్యమైన పనిని ఎట్టకేలకు పూర్తిచేయగలుగుతారు. కొన్ని సంఘటనలు నిరుత్సాహపరుస్తాయి. ఒక వార్త ఇబ్బంది కలిగిస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని పూజిస్తే శుభఫలితాలు కలుగుతాయి.

ప్రారంభించబోయే పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ వాతావరణం అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. చిరునవ్వుతో సమస్యలు దూరం అవుతాయి. దైవారాధన మానవద్దు.

మీ మీ రంగాల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఒక ముఖ్యమైన పనిలో కదలిక వస్తుంది. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. గోసేవ చేయాలి.

 

శుభఫలితాలు ఉన్నాయి. కుటుంబ సహకారం ఉంటుంది. ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయగలుగుతారు. ఎవరితోనూ వాగ్వాదాలకు దిగవద్దు. దైవారాధన మానవద్దు.

శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఒక వ్యవహారంలో చంచలబుద్ధితో వ్యవహరించి ఇబ్బందులు పడతారు. మనోధైర్యంతో చేసే పనులు సత్ఫలితాన్ని ఇస్తాయి. దైవారాధన మానవద్దు.

ముఖ్య విషయాల్లో మనోనిబ్బరం అవసరం. కొన్ని సందర్భాల్లో  అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు. అనవసర ఖర్చులు చేస్తారు. నిపుణులను సంప్రదించి కీలక లావాదేవీలు చేయడం ఉత్తమం. శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని