Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (14-09-2022)

Horoscope Today:  ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (14-09-2022)

Updated : 14 Sep 2022 06:14 IST

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

ధనాగమనసిద్ధి ఉంది. సొంతింటి వ్యవహారంలో ముందడుగు పడుతుంది. బంధుమిత్రులను కలుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఒక వార్త ఆనందాన్నిస్తుంది. సుబ్రహ్మణ్యభుజంగ స్తోత్రం పఠించడం మంచిది.

మధ్యమ, శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. గతంలో నిర్లక్ష్యం చేసిన కొన్ని అంశాలు  ఇబ్బంది పెడతాయి. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. గోసేవ చేయడం వలన మంచి ఫలితాలు పొందుతారు

ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. స్వస్థాన ప్రాప్తి సూచనలు ఉన్నాయి. స్థిరనిర్ణయాలతో చేసే పనులు ఫలిస్తాయి. దుర్గాస్తుతిని పఠిస్తే బాగుంటుంది.

సంతోషకరమైన వార్త వింటారు. ఆత్మీయులు ప్రేమాభిమానాలు కురిపిస్తారు. సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ధనలాభం సూచితం. వివాదాల్లో తలదూర్చకండి. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి సందర్శనం శ్రేయోదాయకం

వృత్తి, ఉద్యోగాల్లో మిశ్రమంగా ఉంటుంది. విందు, వినోదకార్యక్రమాల్లో పాల్గొంటారు. బలమైన ప్రయత్నాలు ఫలిస్తాయి. అపోహలతో కాలాన్ని వృథా చేయకండి. ఈశ్వరదర్శనం చేయడం మంచిది.

శారీరక శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులకు స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. కొన్ని కీలకమైన వ్యవహారాలలో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. శని ధ్యానం చేయాలి

తలపెట్టిన కార్యాన్ని పూర్తిచేస్తారు. ఉద్యోగ పరంగా అనుకూలంగా ఉంది. మితంగా ఖర్చుచేయాలి. శ్రమ కాస్త పెరుగుతుంది. కుటుంబసభ్యుతో ప్రేమగా మెలగాలి. సాయి నామాన్ని స్మరిచండి.

ఒక శుభవార్త వింటారు. ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి కీలక విషయాలు చర్చిస్తారు. శివ అష్టోత్తర శతనామావళి పారాయణ చేయడం మంచిది.

ధర్మ సిద్ధి ఉంది. ఏ పని తలపెట్టినా ఇట్టే పూర్తవుతుంది. కొన్ని కీలక వ్యవహారాలను వారితో చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తిచేయగలుగుతారు. కొన్ని చర్చలు మీకు లాభిస్తాయి. ప్రసన్నాంజనేయ సోత్రం పారాయణ చేయాలి.

కీలక నిర్ణయాల్లో కుటుంబ సభ్యుల సహకారం మేలు చేస్తుంది. మనోధైర్యంతో ముందుకు సాగి పనులను పూర్తిచేస్తారు. ఇబ్బంది పెట్టే వారిని పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుపోతే ఇబ్బందులు ఉండవు. గణపతిని ఆరాధిస్తే ఆటంకాలు తొలగుతాయి.

శుభకాలం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధిచిన వార్త వింటారు. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. కనకధారాస్తవం పఠించాలి.

అందరినీ కలుపుకొని పోవడం అవసరం. కొన్ని సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కీలక  వ్యవహారాలలో ముందడుగు పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలు ఫలిస్తాయి. ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని