Published : 26 Jun 2022 03:58 IST

Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (26-06-2022)

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

మనోబలంతో చేసే పనులు సఫలం అవుతాయి. తోటివారితో విబేధాలు రాకుండా చూసుకోవాలి. అనవసరంగా కష్టాలను కొని తెచ్చుకుంటారు. కొన్ని పరిస్థితులు మనోవిచారాన్ని కలిగిస్తాయి. దుర్గాధ్యానం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.

శుభకాలం. మానసికంగా దృఢంగా ఉండి, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలుగుతారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. దత్తాత్రేయ అష్టోత్తర శతనామావళి చదివితే బాగుంటుంది.

చంచల స్వభావాన్ని దరిచేరనీయకండి. కష్టాలు పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బంది  పెడతాయి. శ్రీరామనామాన్ని జపించడం శుభప్రదం.

శుభకాలం. పనులు వేగవంతంగా పూర్తి అవుతాయి. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. బంధువులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో అనుకూలమైన సమయం. ఆర్ధిక విషయాలు అనుకూలంగా ఉన్నాయి. ఇష్టదైవారాధన శుభకరం.

బుద్ధిబలంతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. మీ పేరు,ప్రతిష్టలు పెరుగుతాయి. మనఃస్సౌఖ్యం ఉంది. ఇష్టదైవారాధన మంచి చేకూరుతుంది.

వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. బుద్ధిబలం బాగుంటుంది. ఆర్ధికంగా శుభఫలితాలు ఉన్నాయి. ఆరోగ్యం ఫరవాలేదనిపిస్తుంది. శ్రమ వల్ల ఒత్తిడి పెరుగుతుంది. మానసిక ప్రశాంతతను కోల్పోరాదు. గణపతి ఆరాధన శుభప్రదం.  

ప్రారంభించబోయే పనుల్లో ఆపదలు పెరగకుండా చూసుకోవాలి. ఉద్యోగంలో ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే మేలైన ఫలితాలు పొందుతారు. ఆర్థికంగా పుంజుకుంటారు. అయినవారి వల్ల సమస్యలు రాకుండా జాగ్రత్తపడాలి. శ్రీవేంకటేశ్వరస్వామిని ఆరాధిస్తే మంచిది.

సుఖ,సౌఖ్యాలు ఉన్నాయి. ప్రారంభించిన కార్యక్రమాలను మనోధైర్యంతో పూర్తిచేస్తారు. తోటివారితో ఆనందంగా గడుపుతారు. బంధు,మిత్రులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. కీలకమైన చర్చలు ఫలిస్తాయి. ఇష్టదైవ ప్రార్థన శుభాన్ని ఇస్తుంది.

వృత్తి,ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో మీకు అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయి. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు. గతంలో ఆగిన పనులను పునఃప్రారంభం చేస్తారు. మహాలక్ష్మి అష్టోత్తరం చదివితే మంచిది.

 

చేపట్టిన కార్యక్రమాలు దైవబలంతో పూర్తి చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు రచించడానికి ఇది సరైన సమయం. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. అనవసర ఖర్చులను అదుపు చేయండి. మనస్సును స్థిరంగా ఉంచుకోవాలి. మనోబలం పెరగడానికి ఆంజనేయ ఆరాధన చేయాలి.

శ్రమ ఫలిస్తుంది. ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉన్నాయి. స్వస్థాన ప్రాప్తి ఉంది. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. పెద్దల ఆశీర్వచనాలు మేలు చేస్తాయి. కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. దుర్గాస్తుతి చదవాలి.

ముఖ్యమైన వ్యవహారాల్లో శోధన చాలా అవసరం. వ్యాపారంలో మీరు చేసే ఆలోచనల్ని ఎదుటివారితో పంచుకోవడం ద్వారా సాధ్యాసాధ్యాలను అంచనా చేయవచ్చు. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. అనవసరంగా భయాందోళనలకు గురవుతారు. శనిధ్యానం శుభప్రదం.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని