Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/06/2023)

Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఉంటుంది.  డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించే నేటి రాశి ఫలాల వివరాలు.

Published : 03 Jun 2023 03:10 IST

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

ప్రారంభించిన పనిలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. దైవబలం రక్షిస్తోంది. బంధు,మిత్రుల సహకారం మేలు చేస్తుంది. నవగ్రహ స్తోత్రం చదివితే శుభ ఫలితాలు కలుగుతాయి.

మీ మీ రంగాల్లో సమర్ధంగా ముందుకు సాగి విజయం సాధిస్తారు. తోటివారికి ఉపయోగపడే కార్యక్రమాలను చేస్తారు. సమాజంలో మంచి పేరుప్రఖ్యాతలు వస్తాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. సుబ్రహ్మణ్య స్వామి సందర్శనం శుభప్రదం. 

కృషి, పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. కొన్నాళ్లుగా పరిష్కారం కాని ఒక సమస్య పరిష్కారం అవుతుంది. సమాజంలో కీర్తి పెరుగుతుంది. గణపతిని పూజిస్తే శుభఫలితాలు కలుగుతాయి.

శ్రమ పెరగకుండా చూసుకోవాలి. తోటివారి సహకారం లభిస్తుంది. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. దగ్గరివారిని దూరం చేసుకోకండి. శ్రీరామనామాన్ని జపిస్తే మేలు జరుగుతుంది.

అనుకున్న పనులను అనుకున్నట్టు చేయగలుగుతారు. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది.  దుర్గాధ్యానం శుభప్రదం.

ఒక మంచివార్త  వింటారు. ప్రారంభించిన పనులలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. అనవసర వివాదాలలో చిక్కుకునే అవకాశం ఉంది.  దైవారాధన మానవద్దు.

మీ మీ రంగాల్లో సందర్భానుసారంగా ముందుకు సాగితే శుభఫలితాలు అందుకుంటారు. మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అనవసర విషయాల్లో తలదూర్చకండి. శ్రీ లక్ష్మీధ్యానం శుభప్రదం.

ఉన్నతమైన ఆలోచనావిధానంతో అనుకున్నది సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవడం   మంచిది.

చేపట్టిన పనులలో చిన్నపాటి సమస్యలు ఎదురైనా పూర్తిచేయగలుగుతారు. మీ మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. కొన్ని వ్యవహారాలలో బుద్దిచాంచల్యంతో వ్యవహరిస్తారు. విష్ణు నామస్మరణ ఉత్తమం.

 

స్థిరమైన బుద్ధితో వ్యవహరిస్తే ఉద్యోగంలో ఉన్నతస్థితి ఏర్పడుతుంది. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు అవసరం అవుతాయి. సకాలంలో ఆదుకునేవారున్నారు. శివారాధన శ్రేయస్కరం. 

విశేషమైన శుభఫలితాలు ఉంటాయి. శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. మనఃస్సౌఖ్యం ఉంది. బంధు,మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఆదిత్య హృదయం చదవడం మంచిది.

చేపట్టే పనుల్లో అలసట పెరగకుండా చూసుకోవాలి. ముఖ్యమైన విషయాల్లో అలోచించి నిర్ణయాలు తీసుకోండి. కొందరి ప్రవర్తన కారణంగా ఆటంకాలు ఎదురవుతాయి. కీలక విషయాల్లో నిపుణులను సంప్రదించడం మంచిది. ప్రశాంతంగా ఆలోచించడం మంచిది. విష్ణు సందర్శనం శుభప్రదం. 

- ఇంటర్నెట్‌ డెస్క్

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు