Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/03/2023)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించే నేటి రాశి ఫలాల వివరాలు.
- డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్
మంచి పనులు చేపడతారు. గొప్పవారితో సత్సాంగత్యం ఏర్పడుతుంది. కీలక విషయాల్లో పురోగతి ఉంటుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.
శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. పక్కవారిని కలుపుకొనిపోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. చంద్ర ధ్యానశ్లోకం చదవడం వల్ల మంచి జరుగుతుంది.
శుభకాలం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధు,మిత్రులతో కలిసి శుభకార్యక్రమంలో పాల్గొంటారు. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. కనకధారాస్తవం చదవాలి.
బుద్ధిబలం బాగుంటుంది. సందర్భోచితంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చెప్పుడు మాటలను వినకండి. ప్రయాణాలలో ఆటంకాలు కలుగుతాయి. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన శుభకరం.
కృషికి తగ్గ ఫలితాలు ఉన్నాయి. కీలక వ్యవహారాల్లో కుటుంబ సహకారం అందుతుంది. బంధుప్రీతి కలదు. ఈశ్వర సందర్శనం శుభప్రదం.
మిశ్రమ కాలం. కష్టాన్ని నమ్ముకొని ముందుకు సాగండి. తిరుగులేని ఫలితాలను అందుకుంటారు. ఒకటీరెండు ఆటంకాలు ఎదురైనా పెద్దగా ఇబ్బంది కలిగించవు. ప్రయాణాల్లో జాగ్రత్త. చంద్ర ధ్యానం శుభప్రదం.
మానసిక ప్రశాంతత ఉంటుంది. ప్రారంభించిన పనిలో ఆత్మీయుల సహకారం అందుతుంది. బంధువుల వల్ల మేలు జరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాల్లో చురుగ్గా పాల్గొంటారు. చంద్రశేఖరాష్టకం చదవడం శుభప్రదం.
అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ఇష్టదైవాన్ని దర్శిస్తే మంచి జరుగుతుంది.
భవిష్యత్ ప్రణాళికలో స్పష్టత వస్తుంది. తోటివారితో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆదాయానికి తగినట్టుగా వ్యయం ఉంది. ప్రయాణాలు ఫలిస్తాయి. శివ నామస్మరణ ఉత్తమం.
మీ అభివృద్ధికి దోహదపడే ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంటారు. తరచూ నిర్ణయాలు మారుస్తూ ఇబ్బంది పడతారు. స్థిరమైన బుద్ధితో ముందుకు సాగండి. కుటుంబంలో సమస్యలు రాకుండా జాగ్రత్తపడాలి. దుర్గా అష్టోత్తరం చదవడం మంచిది.
మీ మీ రంగాల్లో విజయావకాశాలు మెరుగవుతాయి. అభివృద్ధి కోసం చేసే ఆలోచనలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలు సాధిస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వచనాలు ఉంటాయి. ప్రయాణాలు ఫలిస్తాయి. ఇష్టదైవారాధన శుభప్రదం.
చేపట్టిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. శారీరక శ్రమ ఎక్కువ అవుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల తర్వాత ఇబ్బంది పడతారు. సుబ్రహ్మణ్య భుజంగ స్తవం చదివితే మంచి ఫలితాలు కలుగుతాయి.
- ఇంటర్నెట్ డెస్క్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Hyderabad: టీచర్, రాజేశ్ చనిపోవాలనుకున్నారు?.. పోలీసుల చేతికి కీలక ఆధారాలు
-
General News
Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
General News
TSPSC: టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో మరో 13 మంది డిబార్
-
Crime News
Nellore: భర్త అంత్యక్రియలు ముగిసిన కొన్ని గంటలకే భార్య మృతి
-
Viral-videos News
Viral Video: ఇదేం వెర్రో..? రన్నింగ్ కారుపై పుష్ అప్స్ తీస్తూ యువకుడి హల్చల్!
-
Politics News
Andhra News: జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తే స్వాగతిస్తాం: సీపీఐ రామకృష్ణ