Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/09/23)

Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది.  డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించే నేటి రాశి ఫలాల వివరాలు.

Updated : 25 Sep 2023 00:22 IST

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

మంచి  ఆలోచనా విధానంతో అనుకున్నది సాధిస్తారు. నూతన కార్యక్రమాలను చేపడతారు. మీ కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. అనూహ్య ధనలాభాన్ని పొందుతారు. లక్ష్మీదేవిని ఆరాధిస్తే ఇంకా బాగుంటుంది.

తలపెట్టిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. కొందరి ప్రవర్తన కాస్త బాధ కలిగిస్తుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. గోసేవ చేస్తే  బాగుంటుంది.  

కీలక విషయాల్లో ఆచి తూచి వ్యవహరించాలి.  మీ కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. హనుమాన్ చాలీసా పఠించాలి.

ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఒక వార్త మీ మనోబలాన్ని పెంచుతుంది.  మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది.  లక్ష్మీ దేవి  సందర్శనం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది.

పట్టువదలకుండా పనిచేసి అనుకున్నది సాధిస్తారు. అనవసరంగా కష్టాలను కొని తెచ్చుకుంటారు. కొన్ని పరిస్థితులు మనోవిచారాన్ని కలిగిస్తాయి. హనుమాన్ చాలీసా పఠించడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి.

కొన్ని కీలక విషయాలలో అనుకున్నఫలితాలు సాధిస్తారు. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. సంతానాభిరవృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. సుబ్రహ్మణ్య భుజంగస్తవం చదివితే  బాగుంటుంది.

మిశ్రమ కాలం.  ఉత్సాహంగా పనిచేయాలి. గొప్ప సంకల్పబలంతో తలపెట్టిన పనులను పూర్తిచేస్తారు. ప్రయాణాలలో ఆటంకాలు ఉంటాయి. శ్రీ వేంకటేశ్వరస్వామి సందర్శనం మంచి ఫలితాన్నిస్తుంది.

 సంతృప్తికర ఫలితాలను రాబట్టడానికి ఇదియే సరైన సమయం. చేపట్టిన పనులలో పురోగతి ఉంటుంది. మానసికంగా ద్రుఢంగా ఉంటారు. సౌభాగ్య సిద్ధి ఉంది. ఇష్టదేవత  స్తోత్రం పఠించడం మంచిది.

తలపెట్టిన కార్యాలు విజయవంతంగా పూర్తవుతాయి. శత్రువులపై  నైతిక విజయాన్ని సాధిస్తారు. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. దుర్గా ధ్యానం చేయడం  వలన మంచి ఫలితాలు పొందుతారు.

 

శ్రమఫలిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.  అవసరానికి తగిన సహాయం చేసేవారు ఉంటారు. ఆంజనేయ స్తోత్రం పారాయణ చేస్తే మంచిది.

శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. ద్వాదశ చంద్ర  సంచారం అనుకూలంగా లేదు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. శ్రీ విష్ణు ఆరాధన చేయడం మంచిది.

పెద్దలు సూచించిన  మార్గంలో ముందుకుసాగి మంచి ఫలితాలను అందుకుంటారు. ధనధాన్య లాభాలున్నాయి. మనస్సౌఖ్యం కలదు. నూతన వస్తువులను సేకరిస్తారు. సమయానుకూలంగా ముందుకు సాగండి మంచి జరుగుతుంది. హనుమత్ ఆరాధన శుభప్రదం.

- ఇంటర్నెట్‌ డెస్క్

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని