Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 06 May 2024 09:09 IST

1. అదీ.. నాయకత్వం!!

విశాఖకు ‘హుద్‌హుద్‌’ తుపాను చేసిన గాయం చరిత్రలో మరచిపోలేనిది. 2014 అక్టోబరులో విరుచుకుపడిన ఆ ఉపద్రవం ఇప్పటికీ కళ్లముందే కదులుతుంది. తుపాను పేరెత్తితో వెంటనే గుర్తుకు వచ్చే హుద్‌హుద్‌ సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. ప్రచండ గాలులు..కుండపోత వర్షంతో విద్యుత్తు, సమాచార వ్యవస్థలు నిమిషాల్లో కుప్పకూలాయి.  విశాఖ తిరిగి సాధారణ స్థితికి వచ్చేందుకు చంద్రబాబు కంటిమీద కునుకులేకుండా పనిచేశారు. పూర్తి కథనం

2. కమలానికి ఆ‘షా’ కిరణం

పరేడ్‌ మైదానంలో జరిగిన ఎన్నికల సభలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రసంగం కమలం కేడర్‌కు జోష్‌నిచ్చింది. ప్రతి మాటలో చలోక్తులు, హాస్యాన్ని జోడించి చేసిన ప్రసంగానికి కేడర్‌ కేరింతలు కొట్టింది. రాహుల్‌ బాబా అంటూ రాహుల్‌ గాంధీని సంబోధించి..నవ్వించారు. సంగానికి ముందు జై శ్రీరాం అంటూ నినదించి.. సభికుల నుంచి కూడా నినాదాలు చేయించారు.పూర్తి కథనం

3. అవినీతి వైకాపా.. అంతానికే మా పొత్తు

రైతులకు మేలు చేసేందుకు ఎన్డీయే ప్రభుత్వం మంజూరుచేసిన పోలవరం ప్రాజెక్టు.. జగన్‌ అవినీతి వల్లే ముందుకు సాగట్లేదని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా విరుచుకుపడ్డారు. కేంద్రంలో నరేంద్ర మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వాలు ఏర్పడతాయని.. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో పోలవరాన్ని పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. మద్యనిషేధం చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్‌.. సీఎం అయ్యాక తానే మద్యం సిండికేట్‌ నడిపిస్తూ నాసిరకం బ్రాండ్లతో ప్రజల ప్రాణాలు బలిగొంటున్నారని దుయ్యబట్టారు.పూర్తి కథనం

4. తీరం దాటినా తీరని కష్టం..!

చేసిన అప్పు తీర్చలేక.. ఆదాయం ఆర్జించలేక నిత్యం వేదనకు గురవడం వలసజీవుల వంతవుతోంది. సిద్దిపేట, మెదక్‌, వికారాబాద్‌ జిల్లాల్లో సరైన ఉపాధి దొరక్క ఎంతోమంది ఎడారి దేశాల బాట పడుతున్నారు. అంత దూరం వెళ్లి చాకిరి చేస్తున్న పలువురు.. ఆశించిన వేతనం దక్కక ఉసూరుమంటున్నారు. పూర్తి కథనం

5. డబ్బు తీసుకోలేదని.. ఎస్టీ ఉద్యోగిపై వైకాపా మూకదాడి

ఎన్నికల్లో అధికార వైకాపా నాయకుల ఆగడాలకు అంతూపొంతూ లేకుండా పోతోంది. తాము ఇచ్చే డబ్బు తీసుకునేందుకు తిరస్కరించిన ఓ ఎస్టీ ఉద్యోగిని కొట్టారు. డబ్బు తీసుకోలేదన్న అక్కసుతో వైకాపా కార్పొరేటర్‌ భర్త ఆయనను చావబాదారు. ఇంట్లోకి వెళ్లి ఆయన భార్య, పిల్లలపైనా ప్రతాపం చూపారు. పోలీసులు అక్కడే ఉన్నా.. ప్రేక్షకపాత్రకే పరిమితమయ్యారు.పూర్తి కథనం

6. సిరా గుర్తు వేసే వేలు లేకపోతే..?

పోలింగ్‌ రోజు ఓటరు ఓటేసినట్లు తెలిసేందుకు, అదే ఓటరు మళ్లీ ఓటు వేయకుండా ఉండేందుకు  సిబ్బంది ఓటరు ఎడమ చేతి చూపుడు వేలికి సిరా గుర్తు పూస్తారు. ఈ సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఓటరుకు ఎడమ చేతికి చూపుడు వేలు లేకపోతే ఏ వేలికి సిరా గుర్తు వేయాలో కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది.పూర్తి కథనం

7. బటన్‌ నొక్కుడు.. వట్టిదేనా జగన్‌?

ఉంగుటూరు మండలం నారాయణపురం గ్రామానికి చెందిన నాగమణి, సత్యవతులు ఈబీసీ నేస్తం పథకం లబ్ధిదారులు. వీరికి మూడో విడతకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్‌ బటన్‌ నొక్కి 51 రోజులు గడిచినా ఇంత వరకు నగదు జమ కాకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పూర్తి కథనం

8. జిల్లాల రద్దు కాదు.. కమిషన్‌ ఏర్పాటు చేస్తాం: మంత్రి తుమ్మల

రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన జిల్లాల ఏర్పాటు శాస్త్రీయంగా లేదని, న్యాయబద్ధమైన కమిషన్‌ వేసి దానిపై నిర్ణయం తీసుకుంటామంటూ సీఎం చెప్పారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కేసీఆర్‌ ఎక్కడకు వెళ్లినా సీఎం రేవంత్‌రెడ్డి మీ జిల్లాను రద్దు చేస్తారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని, అన్ని జిల్లాలను రద్దు చేస్తే పాలన నడుస్తుందా? అని తుమ్మల ప్రశ్నించారు.పూర్తి కథనం

9. ఉద్యోగులు.. ఓటేయకూడదని..

అనుకున్నదే అయ్యింది. ఉద్యోగుల వ్యతిరేకతను వారి ఉత్సాహాన్ని నీరుగార్చే ప్రయత్నం అడుగడుగునా కళ్లకు కట్టింది. పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ నిర్వహణ తీరుపై పెద్దఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. సాధ్యమైనంత వరకు ఉద్యోగులు ఓటు వేయకుండా చూడాలనే ప్రభుత్వ పన్నాగంలో భాగంగానే కనీస ఏర్పాట్లకు మోకాలడ్డారన్న విమర్శలు వ్యక్తమయ్యాయి.పూర్తి కథనం

10. ‘స్టాక్‌ ట్రేడింగ్‌’.. మోసాలు లోడింగ్‌!

స్టాక్‌ ట్రేడింగ్‌’లో సహకరిస్తామని నమ్మిస్తూ సైబర్‌ నేరగాళ్లు రూ.కోట్లలో కొల్లగొడుతున్నారు. ఈ మోసగాళ్ల బారినపడి తెలంగాణలో ఈ ఏడాది మొదటి రెండు నెలల్లోనే 213 మంది బాధితులు రూ.27.4 కోట్లు పోగొట్టుకున్నారు. గత ఏడాది 627 మంది నుంచి నేరగాళ్లు రూ.3.9 కోట్లు దోచుకున్నారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, చార్టర్డ్‌ ఎకౌంటెంట్లు, ఇతర హైప్రొఫైల్‌ ప్రొఫెషనల్స్‌ను లక్ష్యంగా ఎంచుకుని నేరగాళ్లు ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారు.పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని