వెల్లుల్లి మాత్రలకు గిరాకీ

రాజస్థాన్‌లోని కోటాలో కృషి విజ్ఞాన కేంద్రం మహిళా సిబ్బంది వెల్లుల్లితో మాత్రలు తయారు చేస్తున్నారు.

Updated : 07 Feb 2021 14:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : రాజస్థాన్‌లోని కోటాలో కృషి విజ్ఞాన కేంద్రం మహిళా సిబ్బంది వెల్లుల్లితో మాత్రలు తయారు చేస్తున్నారు. 500, 1000 మిలీగ్రాములుగా ఆన్‌లైన్‌లో లభించే వీటికి ఇప్పుడు దేశవ్యాప్తంగా డిమాండ్‌ పెరిగింది. ఔషధ గుణాలు ఉన్న వెల్లుల్లి ద్వారా కీళ్ల నొప్పులు, బ్లడ్‌ కొలెస్టాల్ర్‌ వంటి జబ్బులు నివారించవచ్చని, చర్మ సౌందర్యానికి ఎంతో మేలని కృషి విజ్ఞాన్‌ కేంద్రంలో సేవలందించే డాక్టర్‌ మమతా తివారీ తెలిపారు. ఎండపెట్టిన వెల్లుల్లిని వలిచి వాటిని పొడి చేస్తామని సిబ్బంది తెలిపారు. కేజీ వెల్లుల్లితో 100 గ్రాముల పౌడర్‌ తయారవుతోందని, ఈ మాత్రల తయారీకి 10 రోజుల సమయం పడుతుందని చెప్పారు. వెల్లుల్లి వాసనకు విరుగుడుగా అందులో జంతు పదార్థాల నుంచి సేకరించే ప్రొటీన్‌ (యానిమల్‌ జెలాటిన్‌), బియ్యం పొట్టు ఉపయోగిస్తున్నామని వివరించారు.

 

ఇవీ చదవండి..

విమానం టైర్ల దగ్గర వేలాడుతూ..

ఉప్పొంగిన ధౌలిగంగా నది
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని