TTD: తిరుమలలో కొనసాగుతోన్న రద్దీ.. 6 కిలోమీటర్ల మేర క్యూలైన్లలో వేచిఉన్న భక్తులు

తిరుమలలో గత కొన్ని రోజులుగా భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతోంది. తమిళ పెరటాసి మాసం మూడో శనివారం నేపథ్యంలో తమిళనాడు నుంచి భక్తులు భారీగా తిరుమలకు చేరుకుంటున్నారు.

Updated : 08 Oct 2022 12:29 IST

తిరుమల: తిరుమలలో గత కొన్ని రోజులుగా భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతోంది. తమిళుల పెరటాసి మాసం మూడో శనివారం నేపథ్యంలో తమిళనాడు నుంచి భక్తులు భారీగా తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌, నారాయణగిరి షెడ్లు నిండిపోయి.. రింగురోడ్డులోని గోగర్భం డ్యాం వరకు భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. దాదాపు 6 కిలోమీటర్లు వరకు భక్తులు బారులు తీరి శ్రీవారి దర్శనార్థం వేచి ఉన్నారు. రద్దీ భారీగా పెరగడంతో వసతి గదులు సరిపోక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. తిరుమలలో పార్కులు, ఫుట్‌పాత్‌లు, వసతి షెడ్లలో ఉండాల్సి వస్తోంది.

భక్తులు సంయమనం పాటించాలి: ఈవో ధర్మారెడ్డి

క్యూలైన్లలోని భక్తులకు దర్శనానికి 48 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఈవో  ధర్మారెడ్డి తెలిపారు. క్యూలైన్లలోని భక్తులు సంయమనం పాటించి దర్శనానికి వేచి ఉండాలని విజ్ఞప్తి చేశారు. క్యూలైన్లలోని భక్తులకు శ్రీవారి సేవకుల ద్వారా అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు అందిస్తున్నట్లు చెప్పారు. క్యూలైన్లలో రద్దీ, తాజా పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు ధర్మారెడ్డి తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని