CI Swarnalatha: ‘ఏపీ 31’లో సీఐ స్వర్ణలత హీరోయిన్‌ కాదు.. దర్శకుడు క్లారిటీ

ఏపీ 31 సినిమాలో ఏఆర్‌ సీఐ స్వర్ణలత (CI Swarnalatha) హీరోయిన్‌ కాదని దర్శకుడు కేవీఆర్‌ స్పష్టం చేశారు.

Updated : 11 Jul 2023 10:02 IST

ప్రొద్దుటూరు: ఏపీ 31 సినిమాలో ఏఆర్‌ సీఐ స్వర్ణలత (CI Swarnalatha) హీరోయిన్‌ కాదని దర్శకుడు కేవీఆర్‌ స్పష్టం చేశారు. సినిమాలో ఆమెది అతిథి పాత్ర మాత్రమేనని వెల్లడించారు. ఈ మేరకు వైఎస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ఏపీ 31’లో స్వర్ణలత పెట్టుబడి పెట్టలేదని.. ఈ చిత్రంలో బిగ్‌బాస్‌ ఫేమ్‌ లహరి హీరోయిన్‌గా చేస్తున్నట్లు వివరించారు. స్వర్ణలతకు సంబంధించి వైరల్‌ అయిన వీడియోలు తమ సినిమాలోనివి కాదని చెప్పారు. 

అయితే, నోట్ల మార్పిడి వ్యవహారంలో బెదిరించి డబ్బులు గుంజిన కేసులో ఇటీవల ఏఆర్‌ సీఐ స్వర్ణలత అరెస్టు కావడం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వృత్తిలో అనేక రకాల ఆరోపణలు ఎదుర్కొన్న ఆమె.. ప్రవృత్తి పరంగా వెండితెరపై మక్కువ పెంచుకున్నారు. సినిమాలపై ఆసక్తి ఉన్న స్వర్ణలత కొంతకాలం క్రితం ఓ పాటకు డ్యాన్స్‌ చేశారు. చిరు ప్రయత్నం అంటూ ఆ వీడియోతో సామాజిక మాధ్యమాల్లో (Viral Videos) హల్‌చల్‌ చేశారు. తాను తీయబోయే సినిమాలో మంచి పాత్ర ఇస్తానని, ఇందుకు డ్యాన్స్‌లో ప్రావీణ్యం ఉండాలని ఓ ప్రజాప్రతినిధి చెప్పడంతో ఒక కొరియోగ్రాఫర్‌ను నియమించుకుని సాధన చేస్తున్నారు. ఇందులో భాగంగానే పలు వీడియోలు తీశారు. ఆమె అరెస్టు కావడంతో యూట్యూబ్‌లో ఈ వీడియోలు వైరల్‌గా మారాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని