Rayapati: మాజీ ఎంపీ రాయపాటి సహా ట్రాన్స్‌స్ట్రాయ్‌ డైరెక్టర్ల ఇళ్లలో ఈడీ సోదాలు

ట్రాన్స్‌స్ట్రాయ్‌ కంపెనీ డైరెక్టర్ల ఇళ్లు, కార్యాలయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహించారు.

Updated : 01 Aug 2023 13:52 IST

హైదరాబాద్‌, గుంటూరు: ట్రాన్స్‌స్ట్రాయ్‌ కంపెనీ డైరెక్టర్ల ఇళ్లు, కార్యాలయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహించారు. తెదేపా నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు, మలినేని సాంబశివరావుతో పాటు మరికొందరు ఆ సంస్థలో డైరెక్టర్లుగా ఉన్నారు. దీంతో హైదరాబాద్‌, గుంటూరులో 9 చోట్ల ఈడీ బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి.

ట్రాన్స్ స్ట్రాయ్‌ కంపెనీ దాదాపు 13 బ్యాంకుల నుంచి రూ.9వేల కోట్లకు పైగా రుణాలు తీసుకుంది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను డొల్ల కంపెనీలకు మళ్లించినట్లు సీబీఐ గతంలో కేసు నమోదు చేసింది. సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఈడీ మనీలాండరింగ్‌ కేసు నమోదు చేసింది. ట్రాన్స్‌స్ట్రాయ్‌ కంపెనీకి చెందిన బ్యాంకు ఖాతాల నుంచి సింగపూర్‌కు నిబంధనలకు విరుద్ధంగా నగదు బదిలీ అయినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని రోడ్‌ నంబర్‌ 27లో ప్రస్తుతం రాయపాటి నివాసముంటున్నారు. దీంతో హైదరాబాద్‌తో పాటు గుంటూరులోని ఆయన నివాసాల్లో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని