TS News: తెరాస ఎంపీ నామాకు ఈడీ స‌మ‌న్లు

బ్యాంకు రుణాల‌ మ‌ళ్లింపు వ్య‌వ‌హారంలో తెరాస లోక్‌స‌భాప‌క్ష నేత‌, ఖ‌మ్మం ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావుకు  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) స‌మన్లు జారీ ..

Updated : 16 Jun 2021 13:35 IST

హైద‌రాబాద్: బ్యాంకు రుణాల‌ మ‌ళ్లింపు వ్య‌వ‌హారంలో తెరాస లోక్‌స‌భాప‌క్ష నేత‌, ఖ‌మ్మం ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) స‌మన్లు జారీ చేసింది. ఈ నెల 25న విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని అందులో పేర్కొంది. నామాతో పాటు మ‌ధుకాన్ కేసులో నిందితులంద‌రికీ ఈడీ స‌మ‌న్లు పంపింది. ఎంపీకి చెందిన మ‌ధుకాన్ సంస్థ‌తో పాటు, గ్రూప్ డైరెక్ట‌ర్ల ఇళ్ల‌లో ఈడీ ఇటీవ‌ల రెండు రోజుల పాటు సోదాలు జ‌రిపిన విష‌యం తెలిసిందే.

సోదాల్లో భాగంగా భారీగా న‌గ‌దు, ద‌స్త్రాల‌ను అధికారుల‌ను స్వాధీనం చేసుకున్నారు. దస్త్రాలు, బ్యాంకు ఖాతాలు, హార్డ్ డిస్కుల‌ను ఈడీ అధికారులు విశ్లేషిస్తున్నారు. జాతీయరహదారి నిర్మాణం కోసం రాంచీ ఎక్స్‌ప్రెస్‌ హైవే ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో వివిధ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఇతర అవసరాల కోసం మళ్లించినట్టు మధుకాన్‌ గ్రూప్‌పై ఈడీ అభియోగం దాఖ‌లు చేసిన విష‌యం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని