New Year 2022: అనుభవంతో చెబుతున్నాం.. ప్లీజ్‌.. వినండి!

‘ఓల్డ్‌ ఈజ్ గోల్డ్‌’  అంటారు. పెద్దవాళ్లు అనుభవంతో చెప్పే మాటలు యువత ఎదుగుదలకు ఎంతో తోడ్పడతాయి. వాస్తవానికి అనుభవాలే అసలైన జీవిత పాఠాలు. అందుకే అంటారు ‘పెద్దల మాట చద్ది మూట’ అని.

Published : 02 Jan 2022 01:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఓల్డ్‌ ఈజ్ గోల్డ్‌’  అంటారు. పెద్దవాళ్లు అనుభవంతో చెప్పే మాటలు యువత ఎదుగుదలకు ఎంతో తోడ్పడతాయి. వాస్తవానికి అనుభవాలే అసలైన జీవిత పాఠాలు. అందుకే అంటారు ‘పెద్దల మాట చద్ది మూట’ అని. మరి కొత్త ఏడాది 2022లో కొత్త పనులు ప్రారంభించాలని ఎన్నో తీర్మానాలు చేసుకుంటారు. వాటితో సమానమైనవి.. పెద్దలు అనుభవంతో చెప్పిన మాటలు. వాటినే ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నారు 60 ఏళ్లు పైబడిన వృద్ధులు. ఇవే జీవితం మాకు నేర్పించిన పాఠాలని హ్యూమన్స్‌ ఆఫ్‌ బాంబే వేదికగా చెప్పారు. యవ్వనం ఎంతో కీలకం.. ఈ సూత్రాలు పాటించి కొత్త ఏడాదికి స్వాగతం పలకాలని ప్లకార్డులతో ఫొటోలు దిగారు. అందులో రాసిన ఆ అమూల్యమైన మాటలేమిటంటే..

పిల్లలారా! ఈతరానికి మేమిచ్చే సలహాలు ఇవే..
దేశ్‌రాజ్‌ సింగ్‌.. వయసు: 75

* టెక్నాలజీ పుంజుకుంటోంది. రోజుకో మార్పు. రోజుకో ఆవిష్కరణలు. అయితే మీరు లాభపడేలా ఉపయోగించండి తప్ప. వాటికి బానిసై మీ సమాయాన్ని వృథా చేసుకోవద్దు.

పరిమళ, వయసు: 80
* మనలో ప్రతీ ఒక్కరికి గతమనేది కచ్చితంగా ఉంటుంది. వాటిని గౌరవించండి. అలాగే! అందరికి సాయపడండి.

ఆర్‌కే చౌదరి, వయసు: 85

* నువ్వు నీ పని చేసుకుంటూ వెళ్లు. కష్టపడి పని చెయ్యి.. ఫలితం దక్కే తీరుతుంది.

రమ, వయసు: 90
* ఫోన్లకు దూరంగా ఉండండి.. క్షణాలే మిమ్మల్ని ఒడిసిపట్టని..

యశ్‌పాల్‌, వయసు: 82
* మీ గురి ఎప్పుడు లక్ష్యం మీదే ఉండాలి. దాని కోసం కష్టపడండి. 

కమల్‌, వయసు: 83
* అమ్మాయిలు! కష్టపడి చదవండి. మీ కాళ్ల మీద మీరు నిలబడి. స్వతంత్రంగా జీవించండి.

అనిలా, వయసు: 70
* ఎవరి మాటలో కాదు వినడం కాదు. మీ మనసు మాట వినండి. మీ ప్యాషన్‌ ఎటు నడిపిస్తుందో.. అటే వెళ్లండి. 

యోగేశ్వర్‌, సుష్మా  వయసు: 72, 68 బుల్లెట్‌ బండి ప్రయాణ ప్రేమికులు
* ట్రావెలింగ్‌ అనేది అద్భుతమైన అనుభవం. అవి ఇచ్చే జ్ఞాపకాలు ఎంతో డబ్బుతో సమానం. ఎప్పుడైనా సరే! ప్రయాణం కోసమని బ్యాగ్‌ ప్యాక్‌ చేసుకున్నప్పుడు ఆలోచించకండి! హాయిగా మీ ప్రయాణం మొదలు పెట్టండి

అరుణ, వయసు: 70

* ఇతరులతో పోల్చుకోవడం మానేయండి. మీకు మీరే సాటి. ఎవరూ మీలా ఉండలేరు.

స్వర్ణజిత్, వయసు: 79
* మీ మనసు అందంగా లేకపోతే.. బాహ్య సౌందర్యం ఎంత అందంగా ఉన్నా అర్థం ఉండదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని