Viral video: బురదలో ఇరుక్కుపోయిన ఏనుగు

బురదలో ఇరుక్కుపోయిన ఏనుగును అటవీశాఖ సిబ్బంది రక్షించిన ఘటన కర్ణాటకలోని బందిపొరా టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌లో చోటు చేసుకుంది

Published : 17 May 2021 01:30 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బురదలో ఇరుక్కుపోయిన ఏనుగును అటవీశాఖ సిబ్బంది రక్షించిన ఘటన కర్ణాటకలోని బందిపొరా టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను బందిపొరా టైగర్‌ రిజర్వ్‌ ట్విటర్‌లో పంచుకుంది. దీంతో ఈ వీడియో ఒక్కసారిగా వైరల్‌ అయింది. ఏనుగు ఒకటి బురదలో చిక్కుకుపోయి పైకి లేచేందుకు అవస్థలు పడటాన్ని అటవీశాఖ సిబ్బంది గుర్తించారు. వెంటనే ఓ జేసీబీని తెప్పించి దాని సాయంతో ఏనుగును పైకి లేపారు. అనంతరం నిల్చోవడానికి ఇబ్బంది పడినా.. తర్వాత కోలుకుని నడిచింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని