Hyderabad: ప్రయాణికులకు శుభవార్త.. మెట్రో వేళ‌లు రాత్రి 11గంట‌ల వ‌ర‌కు పొడిగింపు

మెట్రో రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌. ఇకపై రాత్రి 11 గంటల వరకు మెట్రోలో ప్రయాణించవచ్చు. ఈనెల 10 నుంచి టర్మినల్‌ స్టేషన్లలో చివరి మెట్రో రైలు రాత్రి 11 గంటలకు బయలుదేరుతుందని హైదరాబాద్‌ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి వెల్లడించారు.

Published : 07 Oct 2022 17:45 IST

హైదరాబాద్‌: మెట్రో రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌. ఇకపై రాత్రి 11 గంటల వరకు మెట్రోలో ప్రయాణించవచ్చు. ప్రస్తుతం రాత్రి 10.15 గంటల వరకే టర్మినల్‌ సేషన్ల నుంచి చివరి మెట్రో ఉండేది. దీన్ని మారుస్తూ.. ఈనెల 10 నుంచి టర్మినల్‌ స్టేషన్లలో చివరి మెట్రో రైలు రాత్రి 11 గంటలకు బయలుదేరుతుందని హైదరాబాద్‌ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి వెల్లడించారు. ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు మెట్రో రైలు వేళలు పొడిగించినట్టు చెప్పారు. ఎప్పటి లాగే ఉదయం 6గంటల నుంచి మెట్రో సేవలు ప్రారంభమవుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని