TS News: భారాసకు కోకాపేటలో 11 ఎకరాలు.. హైకోర్టులో పిల్‌

భారాసకు కోకాపేటలో 11 ఎకరాల భూ కేటాయింపుపై.. హైకోర్టులో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్‌జీజీ) పిల్‌ దాఖలు చేసింది.

Updated : 10 Jul 2023 20:31 IST

హైదరాబాద్‌: భారాసకు కోకాపేటలో 11 ఎకరాల భూమి కేటాయించడంపై.. హైకోర్టులో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్‌జీజీ) పిల్‌ దాఖలు చేసింది. కోకాపేటలో ఖరీదైన భూమిని భారాస పార్టీ కార్యాలయం కోసం కేటాయించారని పిల్‌లో పేర్కొంది. ఎకరానికి రూ.50 కోట్ల విలువైన భూమిని రూ.3.41 కోట్లకే కేటాయించారని.. కేవలం అయిదు రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేశారని వెల్లడించింది. భూ కేటాయింపు పత్రాలనూ రహస్యంగా పెట్టారన్న పిటిషనర్.. శిక్షణ, ఎక్సలెన్స్ కేంద్రం పేరిట భారాస భూమి పొందినట్లు తెలిపింది. భారాసకు బంజారాహిల్స్‌లో పార్టీ కార్యాలయం ఉన్నప్పటికీ మళ్లీ భూమి కేటాయించారంది. ఈ మేరకు భారాసకు భూ కేటాయింపు జీవోను రద్దు చేయాలని హైకోర్టును ఎఫ్‌జీజీ కోరింది. కోకాపేటలో నిర్మాణ పనులు జరపకుండా స్టే ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని