Hyderabad: లింగంపల్లి అండర్‌పాస్‌ కిందకు భారీగా వరదనీరు.. వాహనదారుల అవస్థలు

నగరంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా లింగంపల్లి రైల్వే అండర్‌పాస్‌ కిందకు భారీగా వరదనీరు చేరింది.

Updated : 20 Jul 2023 12:33 IST

హైదరాబాద్‌: నగరంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా లింగంపల్లి రైల్వే అండర్‌పాస్‌ కిందకు భారీగా వరదనీరు చేరింది. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. మోకాళ్ల లోతు వరకు నీరు చేరుకోవడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. వర్షం పడితే వరదనీటితో లింగంపల్లి అండర్‌పాస్‌ రోడ్డు దారుణంగా తయారవుతోందని.. ఈ సమస్యను పరిష్కరించే దిశగా అధికార యంత్రాంగం దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని