Telangana news: మా భూములు ఇచ్చేది లేదు..: రైతులు

మహబూబ్‌నగర్  జిల్లా హన్వాడ మండలంలో ఏర్పాటు చేయబోయే ఆహార శుద్ధి పరిశ్రమ కేంద్రానికి ఆదిలోనే చుక్కెదురవుతోంది.

Published : 17 May 2022 02:06 IST

మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలంలో ఏర్పాటు చేయబోయే ఆహార శుద్ధి పరిశ్రమ కేంద్రానికి ఆదిలోనే చుక్కెదురవుతోంది. మొదటి దశలో 244 ఎకరాలను సేకరించి ఆ స్థలాన్ని రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థకు అప్పగించగా.. మౌలిక వసతుల కల్పన పనులు మొదలయ్యాయి. దీంతో ఆ భూములలో అసైన్డ్ పట్టా ఉన్న కొందరు రైతులు నిరసనకు దిగారు. ఆ భూములనే తాము సాగు చేసుకుంటామని.. పరిశ్రమలకు ఇచ్చే ప్రసక్తే లేదని తెగేసి చెబుతున్నారు. దశాబ్దాలుగా ఈ భూములే జీవనాధారంగా ఉన్నాయని, వాటిని లాక్కోవడానికి ప్రయత్నిస్తే ఆందోళనలకు దిగుతామని హెచ్చరిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని