విభజన రాజకీయాలను వ్యతిరేకించాలి..

మోదీ అవలంభిస్తున్న విభజన రాజకీయాలను వ్యతిరేకించాలని కోరుతూ జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షురాలు అయిషే ఘోష్‌ కోరారు.

Published : 11 Jan 2020 19:45 IST

దిల్లీ: మోదీ అవలంభిస్తున్న విభజన రాజకీయాలను వ్యతిరేకించాలని కోరుతూ జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షురాలు అయిషే ఘోష్‌ కోరారు. కోల్‌కతా పోర్ట్‌ ట్రస్ట్‌ 150వ వార్షిక ఉత్సవాల సందర్భంగా దేశ ప్రధాని నరేంద్రమోదీ రెండ్రోజుల పాటు కోల్‌కతాలో పర్యటించనున్నారు. ఈ మేరకు శనివారం కోల్‌కతా చేరుకొని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో మోదీ సమావేశమయ్యారు. ఇదిలా ఉండగా.. మోదీ పర్యటను వ్యతిరేకిస్తూ జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం అధ్యక్షురాలు అయిషే ఘోష్‌.. బెంగాల్‌ ప్రజలను ఉద్దేశిస్తూ ఒక  వీడియో సందేశం పంపించారు. 
‘నేను కూడా బెంగాల్‌ (దుర్గాపూర్‌లోని అసాన్‌సోల్‌) నుంచి వచ్చాను. దేశ వ్యాప్తంగా మోదీ విభజన రాజకీయాలు చేస్తున్నారు. విభజన రాజకీయాలను బెంగాల్‌ ప్రజలు వ్యతిరేకించాలి. భాజపా ప్రభుత్వం అల్లర్లు సృష్టించాలని యత్నిస్తోంది. ఇలాంటి రాజకీయాలను మన రాష్ట్రంలో ఏమాత్రం అనుమతించవద్దు’ అని ఆమె కోరారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని