గుంటూరు సబ్‌జైలుకు గల్లా జయదేవ్‌

అమరావతిలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో పాల్గొని అరెస్టైన ఎంపీ గల్లా జయదేవ్‌కు మంగళగిరి మేజిస్ట్రేట్‌ రిమాండ్‌ విధించారు. దీంతో పోలీసులు ఆయన్ను మంగళవారం...

Updated : 21 Jan 2020 08:33 IST

గుంటూరు: అమరావతిలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో పాల్గొని అరెస్టైన ఎంపీ గల్లా జయదేవ్‌కు మంగళగిరి మేజిస్ట్రేట్‌ రిమాండ్‌ విధించారు. దీంతో పోలీసులు ఆయన్ను మంగళవారం తెల్లవారుజామున గుంటూరు సబ్‌జైలుకు తరలించారు. నిన్న ఉదయం పోలీసుల నిఘా, నిషేధాజ్ఞలను దాటుకుని అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వ్యూహాత్మకంగా చేరుకున్నారు. దీంతో పోలీసులు జయదేవ్‌ను అడ్డుకొన్నారు. ఈ క్రమంలో  పోలీసులు, జయదేవ్‌కు మధ్య పెనుగులాట జరిగి ఆయన చొక్కా సైతం చిరిగిపోయింది. దీంతో పోలీసులు జయదేవ్‌ను అదుపులోకి తీసుకుని దుగ్గిరాల, పెదకాకాని, గుంటూరు మీదుగా నరసరావుపేట.. అక్కడి నుంచి రొంపిచర్ల స్టేషన్‌కు తరలించారు. అనంతరం నాన్‌బెయిలబుల్‌  సెక్షన్ల కింద కేసులు నమోదుచేశారు. ఈ క్రమంలో ఆయన్ను రిమాండ్‌కు పంపడానికి పోలీసులు రొంపిచర్ల పోలీసుస్టేషన్‌ నుంచి గుంటూరు తీసుకొచ్చి అర్ధరాత్రి  వరకూ పోలీసు వాహనంలోనే కూర్చోబెట్టారు. అర్ధరాత్రి 12.30 గంటలకు జీజీహెచ్‌ వైద్యులతో జయదేవ్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని