60 లక్షల మందితో 620కి.మీ. మానవహారం

పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) వెంటనే రద్దు చేయాలని కేరళ ప్రభుత్వం వినూత్న రీతిలో నిరసన తెలిపింది. రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో ఏకంగా 620 కిలోమీట్లర్ల మానవహారాన్ని ఏర్పాటు చేసి సీఏఏపై నిరసనను ప్రభుత్వ నిరసనను..

Published : 27 Jan 2020 01:52 IST

సీఏఏపై కేరళలో వినూత్న నిరసన

తిరువనంతపురం: పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) వెంటనే రద్దు చేయాలన్న డిమాండ్‌తో కేరళ ప్రభుత్వం వినూత్న రీతిలో నిరసన తెలిపింది. రాష్ట్ర రాజధాని తిరువనంతపురం నుంచి  ఏకంగా 620 కిలోమీట్లర్ల మానవహారాన్ని ఏర్పాటు చేసి సీఏఏపై నిరసనను ప్రభుత్వ నిరసనను తెలియజేసింది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ సైతం ఈ మానవహారంలో పాల్గొన్నారు. ఉత్తర కేరళలోని కాసర్‌గోడ్‌ ప్రాంతం నుంచి మెదలైన మానవహారం ఏకంగా 620 కిలోమీటర్ల మేర సాగుతూ రాష్ట్రానికి దక్షిణ ప్రాంతంలో ఉన్న కళియక్కవిలాయ్‌ వరకు కొనసాగింది. ఈ మానవహారంలో దాదాపు 60 నుంచి 70 లక్షల మంది పాల్గొన్నట్లు ప్రభుత్వం పేర్కొంది. కాసర్‌గోడ్‌లో సీనియర్‌ సీపీఐ (ఎం) నేత ఎస్‌.రామచంద్రన్‌ పిళ్లాయ్‌తో మొదలైన ఈ మానవహారం దక్షిణ కేరళలోని కళియక్కవిలాయ్‌లో ముగిసింది. విభిన్న రంగాలకు చెందిన అనేక మంది ఈ మానవహారంలో పాలుపంచుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు