అమరావతి భూములపై ఐటీశాఖకు సీఐడీ లేఖ

ఐటీ చీఫ్‌ కమిషనర్‌కు ఏపీ సీఐడీ అడిషినల్‌ డైరెక్టర్‌ పి.వి.సునీల్‌ కుమార్‌  లేఖ రాశారు. అమరావతిలో  2018 నుంచి 2019 వరకు భూముల కొనుగోలుపై విచారణ...

Updated : 08 Feb 2020 13:23 IST

అమరావతి : ఐటీ చీఫ్‌ కమిషనర్‌కు ఏపీ సీఐడీ అడిషనల్‌ డైరెక్టర్‌ పి.వి.సునీల్‌ కుమార్‌  లేఖ రాశారు. అమరావతిలో  2018 నుంచి 2019 వరకు భూముల కొనుగోలుపై విచారణ చేపట్టాలని కోరారు. రూ.2లక్షలకు మించి  జరిగిన అనుమానిత లావాదేవీలపై విచారణ జరపాలని పేర్కొన్నారు. ఐటీ చట్టాలను ఉల్లంఘిస్తూ జరిగిన భూముల అమ్మకాలు, కొనుగోళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అసైన్డ్‌ భూములు కొనుగోలు చేసిన  106 మంది వివరాలను కూడా లేఖతో పాటు ఐటీ అధికారులకు సునీల్‌ కుమార్‌ పంపారు. భూముల అడ్రస్‌తోపాటు‌, సర్వే నంబర్లను కూడా ఐటీ కమిషనర్‌కు అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని