శ్రీనివాస్‌ ఇంట్లో ఐటీ సోదాలపై నివేదిక

తెదేపా అధినేత చంద్రబాబు మాజీ పీఎస్‌ శ్రీనివాస్‌ నివాసంలో ఐటీ అధికారులు జరిపిన సోదాలకు సంబంధించిన పంచనామా నివేదిక వెలుగులోకి వచ్చింది...

Updated : 16 Feb 2020 10:49 IST

అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబు మాజీ పీఎస్‌ శ్రీనివాస్‌ నివాసంలో ఐటీ అధికారులు జరిపిన సోదాలకు సంబంధించిన పంచనామా నివేదిక వెలుగులోకి వచ్చింది. శ్రీనివాస్‌ ఇంట్లో రూ.2.63లక్షల నగదు, 12 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు నివేదికలో వెల్లడైంది. సోదాల అనంతరం పంచానామా నివేదికపై శ్రీనివాస్‌, ఐటీ అధికారుల సంతకాలు చేసినట్లు నివేదికలో ఉంది. శ్రీనివాస్‌ నివాసంలో ఐటీశాఖ అధికారులు పెద్ద ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నారని రెండ్రోజుల నుంచి ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే  తాజా పంచనామా నివేదికతో ఆ ఆరోపణలు అవాస్తమని ఐటీ నివేదిక ద్వారా వెల్లడైంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని