దిశ నిందితుల కుటుంబాలకు సుప్రీంలో చుక్కెదురు

దిశ నిందితుల కుటుంబాలు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది.ఒక్కో కుటుంబానికి పరిహారంగా రూ.50లక్షలు ఇవ్వాలని, పోలీసులపై ఎఫ్ఐఆర్‌ నమోదు చేయాలని నిందితుల కుటుంబాలు పిటిషన్‌లో పేర్కొన్నాయి.ఈ కేసుకు సంబంధించి....

Updated : 28 Feb 2020 16:13 IST

దిల్లీ: దిశ నిందితుల కుటుంబాలు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది.ఒక్కో కుటుంబానికి పరిహారంగా రూ.50లక్షలు ఇవ్వాలని, పోలీసులపై ఎఫ్ఐఆర్‌ నమోదు చేయాలని నిందితుల కుటుంబాలు పిటిషన్‌లో పేర్కొన్నాయి.ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే న్యాయ విచారణకు కమిషన్‌ వేశామని, ఈ సమయంలో పిటిషన్‌ను విచారణకు స్వీకరించలేమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బోబ్డే స్పష్టం చేశారు. న్యాయ విచారణ కమిషన్‌ను కలిసే స్వతంత్రత ఇస్తున్నామన్న సీజేఐ, ఏం చెప్పాలనుకున్నా న్యాయ కమిషన్‌కు తెలపాలని సూచించారు. న్యాయం జరగలేదని భావిస్తే మళ్లీ కోర్టును ఆశ్రయించవచ్చని సీజే ధర్మాసనం పేర్కొంది. సీజేఐ సూచనతో పిటిషన్‌ను ఉప సంహరించుకున్నట్టు న్యాయవాది తెలిపారు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని