హోలీ.. చీరకట్టులో పురుషుల కేళీ!

హోలీ పండుగను పురస్కరించుకొని కర్నూలు జిల్లాలో పురుషులు చీరలు ధరించి పూజలు చేసే సంప్రదాయం ఆసక్తి కలిగిస్తోంది. కర్ణాటక సరిహద్దులోని ఆదోని మండలం సంతేకుడ్లూరు గ్రామంలో హోలీ మరుసటి రోజున పురుషులు.. స్త్రీ వేషంలోకి మారిపోతారు.

Published : 10 Mar 2020 19:38 IST

కర్నూలు జిల్లాలో ఆసక్తి కలిగిస్తున్న సంప్రదాయం

కర్నూలు: హోలీ పండుగను పురస్కరించుకొని కర్నూలు జిల్లాలో పురుషులు చీరలు ధరించి పూజలు చేసే సంప్రదాయం ఆసక్తి కలిగిస్తోంది. కర్ణాటక సరిహద్దులోని ఆదోని మండలం సంతేకుడ్లూరు గ్రామంలో హోలీ మరుసటి రోజున పురుషులు.. స్త్రీ వేషంలోకి మారిపోతారు. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు చీరలు ధరించి, తలలో పూలు పెట్టుకుని అందంగా ముస్తాబై రతీ మన్మథులకు ప్రత్యేక పూజలు చేస్తారు. తరతరాల నుంచి పాటిస్తున్న ఈ ఆచారంతో కోరిన  కోర్కెలు తీరుతాయనేది అక్కడి ప్రజల విశ్వాసం. దాదాపు 200 సంవత్సరాల నుంచి గ్రామంలో ఈ ఆచారం పాటిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. 
హిందూ, ముస్లిం అనే తేడా లేకుండా అన్ని మతాల పురుషులు.. స్త్రీ వేషంలో పూజలు చేస్తారు. ఈ వింత ఆచారాన్ని చూసేందుకు పొరుగు రాష్ట్రాల నుంచి సైతం ప్రజలు తరలివస్తారని స్థానికులు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని