కరోనా: కదిలిస్తున్న వైద్యుడి భార్య ట్వీట్‌

ప్రపంచాన్ని కరోనా వైరస్‌ వణికిస్తోంది. 140 దేశాలకు వ్యాపించిన ఈ ప్రాణాంతక వైరస్‌ ఇప్పటికే వేలాది మందిని బలితీసుకుంది. రోజురోజుకూ పెరుగుతున్న  కరోనా కేసులు ఆయా దేశాలకు ఊపిరాడకుండా చేస్తున్నాయి.

Updated : 18 Mar 2020 18:12 IST

వాషింగ్టన్‌: ప్రపంచాన్ని కరోనా వైరస్‌ వణికిస్తోంది. వివిధ దేశాలకు వ్యాపించిన ఈ ప్రాణాంతక వైరస్‌ ఇప్పటికే వేలాది మందిని బలితీసుకుంది. రోజురోజుకూ పెరుగుతున్న  కరోనా కేసులు ఆయా దేశాలకు ఊపిరాడకుండా చేస్తున్నాయి. వైరస్‌ బాధితులకు చికిత్సలు చేసిన వైద్యులను సైతం కరోనా విడిచిపెట్టడం లేదు. వైరస్‌ బాధితులతో పాటు వైద్యులు కూడా స్వీయ నిర్బంధంలో ఉంటున్నారు. అయినా, వైద్య సేవలు అందిస్తూనే ఉన్నారు. ఈమేరకు ఓ వైద్యుడి భార్య ఈ వైరస్‌ తమ జీవితాలను మార్చేసిన విధానాన్ని ట్విటర్లో పంచుకున్నారు. ఇప్పుడు ఆ ట్వీట్లు నెటిజన్లను కదిలిస్తున్నాయి. అమెరికాకు చెందిన రాచెల్‌ పాట్జెర్‌ భర్త ఫిజీషియన్‌గా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు సంతానం. ఆమె రెండు వారాల క్రితం శిశువుకు జన్మనిచ్చింది. అయితే, ఆ బిడ్డను తన భర్త కనీసం తాకనైనా లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

‘నా భర్త ఫిజీషియన్‌. మాకు ముగ్గురు పిల్లలు. ఆయన ప్రస్తుతం కరోనా బాధితులకు వైద్య సేవలు అందించడంలో నిమగ్నమయ్యారు. ఆయన నుంచి ఇతరులకూ వైరస్‌ సోకుతుందన్న కారణంతో ఆయనను మా అపార్టుమెంటులోనే నిర్బంధించాల్సి రావడం చాలా కష్టంగా అనిపిస్తోంది. వారం రోజుల క్రితం మాకు పాప జన్మించింది. మమ్మల్ని విడిచి క్షణమైనా ఉండని ఆయన.. వారాల పాటు మాకు దూరంగా ఉండటం చాలా బాధగా ఉంది. ఆయన చేతులతో కనీసం ఒక్కసారైన బిడ్డను తాకలేదు. ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం వైద్యులు చేస్తున్న త్యాగానికి ఇది చక్కటి ఉదాహరణ. అయితే, బార్లు, రెస్టారెంట్లలో కిక్కిరిసిన ప్రజల చిత్రాలు చూస్తుంటే విచిత్రంగా ఉంది. ఎంతో మంది వైద్యులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వైద్య సేవలు అందిస్తున్నారు. అదే సమయంలో కొంతమంది నిర్లక్ష్యంగా సామాజిక దూరాన్ని పాటించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇది సరికాదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ తీవ్రంగా పరిగణించాలి. కరోనా బాధితులకు నిరంతరం సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందికి ధన్యవాదాలు’ అని ఆమె పేర్కొన్నారు.

ఆమె చేసిన ఈ ట్వీట్లపై చాలా మంది నెటిజన్లు స్పందిస్తున్నారు. కొంతమంది వైద్యులను పొగడ్తల్లో ముంచెత్తుతుండగా.. మరికొంతమంది తమ అనుభవాలను కూడా పంచుకుంటున్నారు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని