లాక్‌డౌన్‌:సిరిసిల్ల కలెక్టర్‌ ఏం చేశారంటే..

కరోనా వైరస్‌ ప్రభావం నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ఈనెల 31 వరకు ప్రజలంతా ఇళ్లలోనే గడపాలని.. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని ప్రభుత్వం...

Updated : 24 Mar 2020 01:57 IST

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ ప్రభావం నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ఈనెల 31 వరకు ప్రజలంతా ఇళ్లలోనే గడపాలని.. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని ప్రభుత్వం సూచించింది. నిత్యావసరాలకు ఇంటికి ఒకరు చొప్పున మాత్రమే రావాలని విజ్ఞప్తి చేసింది. అయితే ప్రజలు చాలా చోట్ల యథావిధిగా రోడ్లపైకి వచ్చారు. ఉదయం ఈ సంఖ్య కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ క్రమంగా అది పెరిగే సూచనలు కనిపించడంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సీఎస్‌, డీజీపీ ఆదేశాల మేరకు పోలీసులు సైతం ఎక్కడికక్కడ వాహనదారులను ఆపివేసి వెనక్కి పంపారు. లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.

సిరిసిల్లలో లాక్‌డౌన్‌ పరిశీలనకు ప్రధాన రహదారిపైకి వచ్చిన జిల్లా కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ వాహనదారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు ఇళ్ల వద్దే ఉండాలని ప్రభుత్వం ఎంత చెబుతున్నా ద్విచక్ర వాహనాలతో పాటు కార్లలో కొందరు బయటకు రావడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వాహనదారులను అడ్డుకుని వెనక్కి పంపేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈనెలాఖరు వరకు రోడ్లపైకి రావొద్దని.. ఇళ్లలోనే ఉండాలని ఆయన సూచించారు. పరిస్థితిని అర్థం చేసుకోవాలని కృష్ణ భాస్కర్‌ విజ్ఞప్తి చేశారు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని