ఏపీ మత్య్సకారులను ఆదుకోండి: నత్వానీ

కరోనా కారణంగా లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో ప్రజావ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. దీంతో దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఎక్కడివారు అక్కడే చిక్కుకుపోయారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు

Updated : 05 Apr 2020 04:47 IST

అమరావతి: కరోనా కారణంగా లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో ప్రజావ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. దీంతో దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఎక్కడివారు అక్కడే చిక్కుకుపోయారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు మత్య్సకారులు సైతం గుజరాత్‌లోని వెరావల్‌ హార్బర్‌లో చిక్కుకుపోయారు. దీంతో వారిని ఆదుకోవాలని గుజరాత్‌ ముఖ్యమంత్రికి ఎంపీ పరిమల్‌ నత్వానీ లేఖ రాశారు. ప్రస్తుతం వారు సొంత రాష్ట్రానికి చేరుకోలేని పరిస్థితి ఉన్నందున వారికి వసతితో పాటు భోజన సౌకర్యాలు కల్పించాలని లేఖలో కోరారు. పరమల్‌ నత్వానీ ఏపీ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా ఖరారు చేస్తూ సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని