పోస్టల్‌ ద్వారా 100 టన్నుల మందులు చేరవేత

లాక్‌డౌన్‌ వేళా తపాలా సేవలు కొనసాగుతున్నాయి. దీని ద్వారా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా దాదాపు 100 టన్నులకుపైగా మందులు, వెంటిలేటర్ల వంటి మెడికల్‌ సామగ్రిని ఆయా చోట్లకు........

Published : 17 Apr 2020 21:10 IST

లాక్‌డౌన్‌లో కొనసాగుతున్న తపాలా సేవలు

దిల్లీ: లాక్‌డౌన్‌ వేళా తపాలా సేవలు కొనసాగుతున్నాయి. దీని ద్వారా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా దాదాపు 100 టన్నులకుపైగా మందులు, వెంటిలేటర్ల వంటి మెడికల్‌ సామగ్రిని ఆయా చోట్లకు చేరవేసినట్లు కేంద్ర హోంశాఖ శుక్రవారం వెల్లడించింది. ఈ మేరకు ఆ శాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య శైల శ్రీవాస్తవ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌ కాలంలో రెండు లక్షలకు పైగా పోస్ట్‌మ్యాన్‌లు, గ్రామీణ డాక్‌ సేవకులు విధుల్లో ఉన్నారని తెలిపారు. పోస్టు సేవలతోపాటు లబ్ధిదారులకు ఆయా సంక్షేమ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తున్నారని వివరించారు. ఈ సమయంలోనూ సమాచార బట్వాడాకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు. స్థానిక అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకుని తపాలా సిబ్బంది ఆహారం, నిత్యావసరాల పంపిణీ సైతం చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని